కాంగ్రెస్ ఓటముల ఎఫెక్ట్-రేపటి ఇండియా కూటమి భేటీపై నీలి నీడలు ? కీలక నేతల డుమ్మా..

అంతా బావుంటే అందరూ మనోళ్లే. పరిస్దితి బాగోకపోతే మిత్రులు కూడా శత్రువులే. ఈ సామెత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. నిన్న మొన్నటి వరకూ కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తోడుగా ఉన్న ఇండియా కూటమి మిత్రులంతా ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో ఓడిపోగానే మోహం చాటేస్తున్నారు. ఎక్కడెక్కడో ఉండి కాంగ్రెస్ పై సెటైర్లు వేస్తున్నారు. రేపు ఇండియా కూటమి భేటీకి కాంగ్రెస్ పార్టీ పిలుపిస్తే వచ్చేందుకు నితీశ్, మమత, అఖిలేష్ వంటి నేతలు రాలేమంటున్నారు.

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్ లో కాంగ్రెస్ ఓటములు ఇప్పుడు ఇండియా బ్లాక్ కు నేతృత్వం వహించాలన్న ఆ పార్టీ ఆశల్ని ఆవిరిచేస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఇండియా కూటమి ఉనికినే ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయి. మూడు రాష్ట్రాల్లో ఓటమి తర్వాత రేపు ఇండియా కూటమి భేటీ ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమాచారం ఇస్తే మేం రాలేమంటూ మిత్రులంతా చెప్పేస్తున్నారు.

mamata, nitish, akhilesh.. india bloc leaders to skip crucial meet tomorrow after congress losses

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ..రేపు జరిగే ఇండియా కూటమి భేటీకి గైర్హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి బదులుగా పార్టీ ఎంపీల్ని పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమిలో చిచ్చుపెట్టినట్లే కనిపిస్తోంది. రేపటి ఇండియా కూటమి భేటీకి జేడీయూ, ఎస్పీ అధినేతలు నితీశ్ కుమార్, అఖిలేష్ తమ బదులు ప్రతినిధుల్ని పంపేందుకు సిద్దమవుతుంటే మమతా బెనర్జీ మాత్రం తనకు పిలుపే రాలేదంటున్నారు.

ఇవన్నీ చూస్తుంటే లోక్ సభ ఎన్నికల వరకూ ఇండియా కూటమి పార్టీలు కలిసి ఉంటాయా లేదా అన్న దానిపై ముమ్మరంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇండియా కూటమి నేతృత్వం విషయంలో కాంగ్రెస్ పార్టీ వాదన ఇకపై నెగ్గకపోవచ్చని తెలుస్తోంది. దీంతో పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల ఓటమి తర్వాత వెంటనే ఇండియా కూటమి భేటీకి పిలుపునిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+