వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమ బెంగాల్ పేరు మార్పు రగడ.. మరోసారి లేఖల యుద్దం

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క పేరు మరోసారి కేంద్ర, రాష్ట్రాల మధ్య అగ్నికి అజ్యం పోసింది.. గత సంవత్సరం బెంగాల్ పేరును మార్చాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మాణం చేసి పంపింది. ఈనేపథ్యంలో పేరు మార్పుకు సంబంధించి ఇంకా ఎలాంటీ నిర్ణయం తీసుకోలేదని ప్రస్థుతం జరుగుతున్న రాజ్యసభ సమావేశాల్లో రాష్ట్రం తరుపున లేవనెత్తిన ప్రశ్నకు, రాష్ట్రం పేరును ఇంకా మార్చలేదని కేంద్రం సమాధానం చెప్పింది..దీంతో కేంద్రం సమాధానం ఇచ్చిన కొద్ది గంటలకే పేరు మార్పు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని మోడికి ముఖ్యమంత్రి మమతా లేఖ రాసింది..

గత జూలైలో పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లా' మార్చాలని అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపారు..కాగా తీర్మాణానికి కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యునిస్టులు కూడ అంగీకరించారు..అయితే పేరు మార్పిడికి సంబంధించి బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర హోం శాఖ సహయ మంత్రి నిత్యానంద రాయ్ ఎంపీ రీటాభ్రత బెనర్జీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా వ్రాతపూర్వక సమాధానం పంపాడు..

Mamata writes to PM Modi after Centre says yet to approve name change

కాగా రాష్ట్రం పేరు మార్చాలంటే రాజ్యంగ సవరణ అవసరమని ఇందుకు సంబంధించి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత పేరు మార్పు ప్రక్రియ ను చేపడతామని లేఖలో తెలిపారు..దీంతో మంత్రి సమాధానం స్పందించిన మమతా ప్రధానికి లేఖ రాసింది..కాగా ఇప్పటికే ఇందుకు సంబంధించి పలుసార్లు అధికారులతో సమావేశాలు కొనసాగాయాని, పేరు మార్పిడికి త్వరగా చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రధానికి లేఖ రాయడంతో మరోసారి అటు మమతా బెనర్జీ ,ఇటు కేంద్రం మధ్య వివాదానికి కేంద్ర బిందువు కానుంది.

English summary
Hours after the Centre informed the Rajya Sabha that it was yet to approve the change of name of West Bengal to ‘Bangla’, Chief Minister Mamata Banerjee shot off a letter to Prime Minister Narendra Modi to expedite the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X