బతికున్న మనిషిని పూడ్చిపెట్టి రోడ్డు వేశారు (వీడియో)
భోపాల్: బతికున్న వ్యక్తి రోడ్డులో ఉన్న గుంతలో పడిపోవడంతో అతని మీద కంకర, మట్టి వేసి పూడ్చి పెట్టిన దారుణ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. గొయ్యిలో పడిపోయిన వ్యక్తిని సజీవ సమాధి చేసి చేతులు దులుపుకున్నారు.
మధ్యప్రదేశ్ లోని కాట్ని జిల్లాలోని ఉడ్లానా-హతా మార్గంలో ఈ ఘటనజరిగిందని పోలీసులు చెప్పారు. ఖాద్రా గ్రామానికి చెందిన లటోరి బర్మాన్ (45) అనే వ్యక్తి మరణించాడని పోలీసులు చెప్పారు. బర్మాన్ తన భార్యతో కలిసి రిషి పంచమి పండుగకు అత్తగారింటికి వెళ్లాడు.
పండుగ జరిగిన తరువాత భార్య పుంటింటిలోనే ఉంది. ఆదివారం బర్మాన్ తన సొంత గ్రామానికి బయలుదేరాడు. మార్గం మధ్యలో ఓ బార్ లో మద్యం సేవించాడు. తరువాత నడుచుకుంటు వెళుతున్నాడు. ఆ సందర్బంలో ఆకస్మికంగా రోడ్డు మద్యలో ఉన్న గుంతలో పడిపోయాడు.
మద్యం మత్తులో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తరువాత రోడ్డు పనులు చేస్తున్న వారు ఆ గుంతలో పడిన బర్మాన్ ను గుర్తించకుండా కంకర, మట్టి వేసి పూడ్చి పెట్టారు. కంకర, మట్టి వేస్తున్న సమయంలో మెలుకవ రావడంతో బర్మాన్ బయటకు రావడానికి ప్రయత్నించాడు.

అయితే చెయ్యి మాత్రం బయటకు వచ్చింది. అతని ప్రాణాలు గుంతలోనే పోయాయి. సోమవారం ఉదయం రోడ్డు మీద చేతిని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో విషయం వెలుగు చూసింది. బర్మాన్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
విషయం తెలుసుకున్న కలెక్టర్ మృతుడి కుంటుంభానికి రూ. 50 వేలు నష్టపరిహారం ప్రకటించారు. కార్మికులు నిర్లక్ష్యంగా పనులు చెయ్యడం వలనే ఇలా జరిగిందని బర్మాన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రోడ్డు పనులు నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications