పెళ్లికి నిరాకరించిందనే కోపంతో యాసిడ్ దాడి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం పార్వతి, ఆమె స్నేహితురాలు గాయత్రితో కలిసి బేగంపూర్ ప్రాంతంలోని మార్కెట్‌కు వెళుతున్న సమయంలో మనోజ్ వారిపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు మనోజ్‌ను త్వరలోనే పట్టుకుంటామని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ చెప్పారు. నిందితుడు మనోజ్‌కు ఇప్పటికే వివాహం జరిగిందని, అయితే పార్వతిని గత కొంత కాలంగా పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని తెలిపారు. పార్వతి పెళ్లికి అంగీకరించకపోవడంతో మనోజ్ ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు చెప్పారు.
గతంలో కూడా పార్వతిని మనోజ్ వేధించాడని, దీంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి తండ్రి తెలిపారు. పోలీసులు అతనికి దేహశుద్ధి చేయడంతో పార్వతిని ఇకపై వేధించానని మనోజ్ తెలిపాడని ఆయన చెప్పారు. అయితే ఆదివారం సాయంత్రం తన కూతురు మార్కెట్‌కు వెళ్లిన సమయంలో ఆమెపై మనోజ్ యాసిడ్ దాడికి పాల్పడ్డాడని ఆయన తెలిపారు. యాసిడ్ దాడిలో తీవ్రగాయాలపాలైన ఇద్దరు యువతులను ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications