భార్య మర్మాంగాన్ని రాగి తీగతో కుట్టేసిన కిరాతకుడు: తీవ్ర రక్తస్రావం: పోలీసుల స్టేట్‌మెంట్‌లో
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ కిరాతక భర్త ఆటవిక చర్యకు పాల్పడ్డాడు. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. అక్కడితో అతని ఆవేశం చల్లారలేదు. భార్య మర్మాంగాన్ని రాగి తీగతో కుట్టేశాడు. అతని కిరాతక చర్యలతో బాధితురాలు ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కటకటాల వెనక్కి నెట్టారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

వివాహేతర సంబంధం అనుమానంతో..
ఉత్తర ప్రదేశ్‌లోని రామ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి పేరు వినావతి. భర్త రాకేష్, అత్తామామలతో రామ్‌పూర్ జిల్లాలోని మిలక్ ప్రాంతంలో ఆమె నివసిస్తోంది. రెండేళ్ల కిందటే ఆమెకు రాకేష్‌తో వివాహమైంది. రాకేష్ దినసరి వేతన కార్మికుడిగా పని చేస్తున్నాడు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే అతను భార్యను అనుమానించే వాడు. ఆమె వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని భ్రమించేవాడు. ఇదే కారణంతో తరచూ వినావతితో ఘర్షణ పడేవాడు. ఆమెను చిత్రహింసలకు గురి చేసేవాడు. తరచూ పుట్టింటికి పంపించేవాడు. పెద్దలు రాజీ కుదర్చడంతో కొద్దిరోజులుగా వారిద్దరూ కలిసి ఉంటున్నారు.

ఆసుపత్రిలో
రాత్రి మద్యం సేవించి ఇంటికొచ్చిన రాకేష్.. మరోసారి వినావతితో ఘర్షణ పడ్డాడు. ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నదో వివరించాలంటూ ఆమెను చావబాదాడు. అక్కడితో అతని ఆవేశం చల్లారలేదు. కాళ్లూ, చేతులు కట్టేసి, రాగి తీగతో భార్య మర్మాంగాన్ని కుట్టేశాడు. ఆ సమయంలో బాధను తట్టుకోలేక ఆమె వేసిన కేకలు విని, చుట్టుపక్కల వారు రక్షించారు.
వినావతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మిలక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వినావతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రాకేష్, అతని తండ్రిని అరెస్ట్ చేశారు. వారిపై పలు కేసులు నమోదు చేశారు. ఆమె మర్మాంగానికి నాలుగు కుట్లు పడినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఆమెకు తీవ్ర రక్తస్రావమైందని చెెప్పారు.

పోలీసుల స్టేట్‌మెంట్‌లో..
రామ్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వినావతి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. తనపై అనుమానం పెంచుకుని నిత్యం వేధిస్తుండేవాడని బాధితురాలు వివరించింది. అకారణంగా తనను కొట్టేవాడని, మరెవరితోనే అక్రమ సంబంధం ఉందనే కారణంతో చిత్రహింసలకు గురి చేసేవాడని చెప్పారు. తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలంటూ రోజూ కొట్టేవాడని అన్నారు. తనకు ఎలాంటి వివాహేతర సంబంధం లేదంటూ బతిమాలినప్పటికీ ఒప్పుకొనే వాడు కాదని, నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని రామ్‌పూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ షొగున్ గౌతమ్ తెలిపారు.