అమ్మాయిల వెంటపడిన కామాంధుడు, పగలు, రాత్రి తేడా లేదు, దుమ్ములేపేశారు !

పగలు, రాత్రి తేడా లేకుండా ఒకే ఇంటిలోని అమ్మాయిలను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్న యువకుడికి దేహశుద్ది చేసిన ఘటన కర్ణాటకలోని తుమకూరు పట్టణంలో జరిగింది. తముమకూరులోని భీమసంద్ర ప్రాంతంలో నివాసం

బెంగళూరు: పగలు, రాత్రి తేడా లేకుండా ఒకే ఇంటిలోని అమ్మాయిలను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్న యువకుడికి దేహశుద్ది చేసిన ఘటన కర్ణాటకలోని తుమకూరు పట్టణంలో జరిగింది. తముమకూరులోని భీమసంద్ర ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరీష్ అనే యువకుడిని శుక్రవారం చితకబాదేశారు.

భీమసంద్ర ప్రాంతంలోనే కెంపన్న, గిరీష్ నివాసం ఉంటున్నారు. కెంపన్నకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రతి రోజు అర్దరాత్రి గిరీష్ కెంపన్న ఇంటి దగ్గరకు వెళ్లి అమ్మాయిలను బయటకు రావాలని చిత్రహింసలు పెడుతున్నాడు. కోపంతో ఇంటి ముందు నిలిపి ఉన్న కెంపన్న బైక్ మీద రాళ్లతో కొట్టి నానా హంగామా చేస్తున్నాడు.

Man beaten by youg girl family in Karnataka

అమ్మాయిల విషయంలో పరువు పోతుందని కెంపన్న చాల కాలంగా ఓపికగా ఉన్నాడు. శుక్రవారం అనారోగ్యంతో ఉన్న కుమార్తెను పిలుచుకుని కెంపన్న తుమకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్లిన గిరీష్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ సైగలు చెయ్యడం మొదలు పెట్టాడు.

ఆ సందర్బంలో యువతి తన తండ్రి కెంపన్నకు విషయం చెప్పింది. కంపన్న తన సోదరులకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించారు. కెంపన్న కుటుంబ సభ్యులు, ఆసుపత్రి ఆవరణంలో ఉన్న వారు కలిసి గిరీష్ ను పట్టుకుని చితకబాదేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు జిల్లా ఆసుపత్రి దగ్గరకు చేరుకుని వివరాలు సేకరించారు. తీవ్రగాయాలైన కామాంధుడు గిరీష్ ను అదే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+