ఆంటీతో సంబంధం: హ్యాండ్ ఇచ్చిందని ఆత్మహత్య
ముజఫర్ నగర్: ఓ మహిళతో యువకుడు వివాహేతర సంబంధం కొనసాగించాడు. చివరికి ఆమె ఇక నావల్ల కాదు అని కలవడానికి నిరాకరించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
ముజఫర్ నగర్ జిల్లాలోని బెగరాజ్ పూర్ లో సోను (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ముజఫర్ నగరలోని స్థానిక మెడికల్ కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళతో సోనుకు పరిచయం అయ్యింది.
ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. సోను నిత్యం ఆమెను కలిసేవాడు. ఆమె లేని జీవితం నాకు వద్దనుకున్నాడు. బుధవారం సాయంత్రం తనను కలవాలని సోను చెప్పాడు.

తాను రాలేనని ఆమె సోనుకు చెప్పింది. కావాలనే కొంత కాలం నుంచి ఆమె తనకు దూరం అవుతున్నదని సోను భావించాడు. బుధవారం రాత్రి వరకు వేచి చూశాడు. ఆమె రాకపోవడంతో సోను ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న సోను కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళ, ఆమె భర్త, కుమారుడు కలిసి సోనును హత్య చేశారని ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. సోను ఆత్మహత్య చేసుకున్నాడా ? హత్యకు గురైనాడా అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications