మనిషి తలను కొరికిన ఒంటె, చికిత్స పొందుతూ మృతి
గాంధీనగర్: ఓ ఒంటె కొరకడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది! గుజరాత్‌లోని అహ్మదాబాదులో ఒంటె 45 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు తీసింది. బాపూ నగర్ ప్రాంతంలోని జమునా నగర్ మురికివాడలో ఆదివారం రాత్రి ఇది చోటు చేసుకుంది.
గోవింద్ త్రివేది అనే వ్యక్తిని ఒంటె కొరికి చంపింది. తల పైన కొరకడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం అతనిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

ప్రాణాలు తీసిన ఒంటె ఏదైనా వ్యాధితో బాధపడుతుందా, గతంలో ఎవరినైనా కరచిందా అనే విషయమై దాని యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే అతని పైన హత్యానేరం కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications