తండ్రి మృతదేహం వద్దే 5 రోజులుగా కొడుకు ఇలా. ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

మధురై: చనిపోయిన తండ్రి మృతదేహం పక్కనే ఆయన కుమారుడు ఐదురోజులపాటు అలాగే కూర్చొన్న ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది.

తమిళనాడు రాష్ట్రంలోని మధురైలోని జీవనగర్ లో అరుల్ రాజ్ కుటుంబం నివాసం ఉంటోంది. ఆయకు 40 ఏళ్ళ కుమారుడు ఉన్నాడు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదు. ఈ క్రమంలోనే వృద్దుడైన అరుల్ రాజ్ గత వారం చనిపోయాడు.

ప్రతిరోజూ నీళ్ళు పట్టుకొనేందుకు వచ్చే అరుల్ రాజ్ ఐదురోజులుగా కన్పించకపోవడంతో పాటు ఆ ఇంటి నుండి భరించరాని దుర్వాసన వస్తుండడంతో జీవనగర్ వాసలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Man Found Sitting By Father's Body For 5 Days In Tamil Nadu

ఆ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టగా ఎవరూ డోర్ తెరవకపోవడంతో తలుపులు పగులకొట్టి వెళ్ళి చూశారు పోలీసులు. అయితే అక్కడ పరిస్థితిని చూసి స్థానికులు , పోలీసులు షాక్ తిన్నారు. కుళ్ళిపోతున్న వృద్దుడి మృతదేహం పక్కనే అతడి కుమారుడు ఉండడం చూసి అతడే హత్య చేసి ఉంటాడని భావించారు.

అతని ప్రవర్తనను గమనించిన పోలీసులు స్థానికులను వాకబు చేసి అరుల్ కుమారుడి మానసికస్థితి సరిగాలేదని తెలుసుకొన్నారు.తండ్రి అరుల్ రాజ్ చనిపోయాడని గుర్తించలేని ఆయన కుమారుడు గత ఐదురోజులుగా మృతదేహం వద్ద కూర్చొని ఉన్నాడు.

ఎలాంటి ఆహారం తీసుకోలేదని కనీసం మంచినీళ్ళు కూడ తాగకపోవడంతో డీహైడ్రేషన్ కు లోనయ్యాడని పోలీసులు చెప్పారు. ఆ వృద్దుడు కన్పించకుండాపోయిన ఏప్రిల్ 25వ, తేదిన చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కొడుకును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Britto has been sitting beside his father, 73-year-old Arul Raj, without any food or water for a long time. 40-year-old Britto is mentally ill and did not know his father had been dead for five days. He had been sitting beside Mr Raj's decomposed body.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి