ప్రియుడితో వెళ్లిపోయిన భార్య: కోర్టుకు భర్త, విడాకులు

ముంబై: తన భార్య ఆమె ప్రియుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న నేపథ్యంలో తనకు విడాకులు ఇవ్వాలన్న బాధితుడి అభ్యర్థన మేరకు మహారాష్ట్రలోని ఓ కుటుంబ కోర్టు అతనికి తన భార్య నుంచి విడాకులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఆ దంపతులిద్దరికి 2012, మే 22న సతారాలో వివాహమైంది. వీరిద్దరూ విఖ్రోలి నుంచి నగరానికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. అయితే తనపై తన భార్యకు ఆసక్తి చూపకపోయేదని, కనీసం తనను తాకడానికి కూడా అనుమతించేది కాదని ఆమె భర్త తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. పెళ్లయిన రెండో రోజు నుంచే ఎవరితోనో ఫోన్లో అదేపనిగా మాట్లాడుకుంటూ ఉండేదని చెప్పాడు.

ఓ రోజు ఆమె దేవాలయాలను సందర్శించేందుకు వెళ్లానని చెప్పి తన ఫోనును ఇంట్లోనే మర్చిపోయిందని చెప్పాడు. ఆ సమయంలో ఫోన్ పదే పదే రింగవుతుండటంతో తన సోదరుడు ఫోన్ ఎత్తాడని.. ఫోన్ చేసింది ఓ మగవాడని అప్పుడే తనకు తెలిసిందని చెప్పాడు. తనతో పెళ్లయినప్పటికీ తన ప్రియుడితో టచ్‌లోనే ఉందని తెలిపాడు. తన కుటుంబ సభ్యులు అతన్ని మర్చిపోవాలని ఆమెను ఎంత కోరినా ఆమె విన్లేదని చెప్పాడు. దీంతో తన కుటుంబ సభ్యులు, తనతో ఎప్పుడూ ఆమె గొడవ పడుతుండేదని చెప్పాడు.

Man granted divorce after wife elopes with her paramour

అయిదే ఐదు నెలల తర్వాత వారితో తన భార్య ఎంతో అప్యాయంగా మెలిగిందని తెలిపాడు. 2012, అక్టోబర్ 3న తన కుటుంబ సభ్యులు మార్కెట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆమె తన ఇంట్లో కనిపించలేదని చెప్పాడు. ఆమె కోసం ఎంత గాలించిన ఆచూకీ దొరకలేదని, ఫోన్ చేసినా ఆమె జవాబు ఇవ్వలేదని తెలిపాడు. ఆ తర్వాతి రోజు ఆమె అదృశ్యమైన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపాడు.

దర్యాప్తు జరిపిన పోలీసులు 2012, అక్టోబర్ 10న ఆమెను గుర్తించారు. ఆమె తన ప్రియుడితో భార్యాభర్తలుగా జీవిస్తున్నారని పోలీసులు అతనికి చెప్పినట్లు తెలిపాడు. దీంతో తాను గత సంవత్సరం ఆగస్టులో విడాకుల కోసం పిటిషన్ వేశానని తెలిపాడు. బాధితుడి భార్య నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కోర్టు అతనికి ఆమె నుంచి విడాకులు మంజూరు చేసింది. బాధితుడు తన వివాహ పత్రిక, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కాపీ, పోలీసుల, తన భార్య తల్లి(అత్త) వాంగ్మూలాన్ని కోర్టు ముందుంచాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+