బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడపులో 10లక్షల విలువైన గోల్డ్ స్మగ్లింగ్: వ్యక్తి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

బెంగలూరు: కడుపులో డ్రగ్స్‌ను దాచి స్మగ్లింగ్ చేసే విధానాన్ని పలు సినిమాల్లో చూసే ఉంటాం. ఆ సినిమాల్లోలానే ఒకతను బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు.

రూ.10 లక్షల విలువైన బంగారాన్ని పెద్ద పేగులో దాచుకున్న స్మగ్లర్‌ను బెంగళూరు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. మహారాష్ట్ర లోని థానేకు చెందిన విజయ్ అశోక్ కుమార్ వద్వానీ అనే వ్యక్తి 330 గ్రాముల బంగారు బిస్కట్లను కడుపులో దాచుకుని స్మగుల్ చేస్తూ పట్టుబడ్డాడు.

Man held with gold worth Rs 10 lakh hidden in rectum at Bengaluru airport

కొలంబో నుంచి వచ్చిన శ్రీలంక ఎయిర్ లైన్స్ విమానంలో ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన విజయ్ అశోక్ కుమార్‌ను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా విషయం బయటపడింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి పాత రికార్డులను పరిశీలిస్తున్నారు. మే 10న కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. 53ఏళ్ల మహిళ 1.17కేజీల బంగారాన్ని తరలిస్తూ పట్టుబడింది.

English summary
The Custom officials at Bengaluru's Kempegowda International airport on Saturday arrested a 40-year-old man for trying to smuggle gold worth Rs 10 lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X