భారీ అగ్ని ప్రమాదం: వందలాది కార్లు, భవనాలు దగ్ధం
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ తుక్కు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగే సమయానికి కంపెనీ మూసి ఉందని పోలీసులు తెలిపారు.
ఫ్యాక్టరీలో మొత్తం 26మంది పనిచేస్తుండగా 300 పాత కార్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మంటల్లో అనేక కార్లు కాలి బూడిదైనట్లు స్థానికులు వెల్లడించారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్న అధికారులు ముందు జాగ్రత్తగా పరిసర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. కాగా, మాజీ ప్రధాని టోనీ అబ్బాట్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.












Click it and Unblock the Notifications