మోసం .. కిడ్నాప్ ... లైంగికదాడి, 11 ఏళ్ల బాలికకు చిత్రహింసలు

అల్వార్ : నవ భారతం కిడ్నాప్‌లు, లైంగికదాడి కేసులతో అల్లాడుతుంది. నిత్యం ఎక్కడో ఏ చోట కీచకుడి కబంధహస్తాలకు అభం శుభం తెలియని పిల్లలు బలవుతూనే ఉన్నారు. హర్యానాలో కూడా ఓ నీచుడు మైనర్ బాలికపై లైంగికదాడి చేసి .. వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కానీ అతగాడు ఆమెను పెళ్లి చేసుకొని .. వయస్సు దాదాపు 11 ఏళ్లు పెద్దదని చెప్పి మోసం చేశాడు. కానీ విచారణలో నిజం బయటపడటంతో ఊచలు లెక్కబెడుతున్నాడు.

మోసం .. కిడ్నాప్ ... లైంగికదాడి ....
హర్యానాకు చెందిన 11 ఏళ్ల బాలిక గత నెలలో కిడ్నాప్‌నకు గురైంది. వెంటనే ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు .. బాలిక ఆఛూకీ కోసం వెతుకున్నారు. కానీ ఆమెకు ఓ మాయగాడు మాయమాటలు చెప్పాడు. మోసపూరిత మాటలు చెప్పి తీసుకెళ్లాడు. మసీదులో పెళ్లి కూడా చేసుకున్నాడు.

Man kidnaps, sexually assaults 11-year-old girl

అయితే బాలిక వయస్సు తక్కువని అనుమానం వ్యక్తం చేస్తే 22 ఏళ్లు అని చెప్పి నమ్మబలికాడు. కానీ మైనర్ బాలికపై లైంగికదాడి చేశారు. ఢిల్లీ, చండీగఢ్ హోటల్స్‌కు తీసుకెళ్లి పలుమార్లు లైంగికదాడి చేశాడు. అంతేకాదు తన భార్య వయస్సు 22 ఏళ్లు అని .. తన కుటుంబసభ్యుల నుంచి ప్రమాదం పొంచి ఉందని చండీగఢ్ కోర్టును కూడా ఆశ్రయించారు.

ఇలా బయటపడింది ..
దీంతో కోర్టు స్పందించింది. బాలిక వయస్సు నిర్ధారించాలని పోలీసులకు సూచించడంతో అతడి బంగారం బయటపడింది. గతనెల 11న బాలిక సోదరుడు ఇచ్చిన కంప్లైంట్‌ను పోల్చిచూసినప్పుడు సరిపోయింది. దీంతో బాలిక వయస్సు 11 ఏళ్లు అని పోలీసులు నిర్ధారించారు. ఆ వెంటనే బాలిక ఉంటున్న మేవాత్‌లో గల నువ్ పోలీస్ లైన్ వద్దకెళ్లి నీచుడి నుంచి పోలీసులు బాలికను తీసుకొచ్చారు.

ఆమె నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. తనను కిడ్నాప్ చేసి .. వేధించాడని పోలీసులకు ఆమె తెలిపింది. దీంతో అతడిపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ ఆఫెన్సెస్ యాక్ట్ (పోక్సో) సహా ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+