భార్యతో గొడవ: కూతుర్ని నరికాడు, మరదలికి గాయాలు

వివరాల్లోకి వెళితే.. నిందితుడు సుబోధ్ సాహు (37) కియోంఝర్ జిల్లాలో పని చేస్తుండగా, అతడి భార్య, పిల్లలు, ఇతర కుటుంబసభ్యులు మాత్రం భువనేశ్వర్‌లో ఉంటున్నారు. అయితే వేరు కాపురం పెట్టాలని అతడి భార్య ఎప్పటినుంచో గొడవపడుతోంది.
అలా చేస్తే ఖర్చులు పెరిగిపోతాయన్న సుబోధ్ ఆమెతో తీవ్రంగా గొడవ పడ్డాడు. ఆ తర్వాత ఆగ్రహంతో తన కన్న కూతుర్ను కత్తి నరికి చంపాడు. అంతటితో ఆగకుండా తన భార్యను, మరదలిని, మేనకోడలిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అతని దాడిలో వారికి తీవ్ర గాయాలయ్యాయి.
అందరిపై కత్తితో దాడి చేసిన తర్వాత నిందితుడు సుబోధ్ విషం తాగి, ఆత్మహత్యకు యత్నించాడు. ఘటనను గమనించిన ఇరుగుపొరుగు వారు బాధితులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications