సెక్స్‌కు అంగీకరించలేదని కూతుర్ని నరికి చంపాడు

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. కామంతో కళ్లుమూసుకుపోయి తనతో శృంగారం చేయలేదని కన్న కూతుర్ని అత్యంత దారుణంగా హత్య చేశాడు. కొడవలితో నరికి చంపేశాడు. ఈ ఘటన మీనాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తఫగంజ్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు రక్తు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమ విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అంతేగాక రెండేళ్ల క్రితం తన భార్య అనుమానాస్పదస్థితిలో మృతి చెందలేదని, తానే ఆమెను హత్య చేశానని నిందితుడు ప్రసాద్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తనతో గొడవకు దిగడంతో ఆమెను హత్య చేసినట్లు నిందితుడి పోలీసులకు వెల్లడించాడు.

తాజా ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు రిక్తు ప్రసాద్‌కు ఐదుగురు పిల్లలు. రక్తు ప్రసాద్ తన పెద్ద కూతురుకు నాలుగు నెలల క్రితం బిషన్పూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. కాగా, రెండు రోజుల క్రితం ఆ దంపతులు రక్తు ప్రసాద్ ఇంటికి వచ్చారు. బుధవారం రాత్రి వారు నిద్రిస్తున్న సమయంలో మద్యం సేవించి వచ్చిన ప్రసాద్.. రంజిత్ కుమార్‌తో గొడవకు దిగాడు. ఆ తర్వాత కొడవలితో చంపుతానని బెదిరించి ఇంటినుంచి గెంటేశాడు.

Man kills daughter for refusing sex

అనంతరం తన కూతురు దగ్గరకు వెళ్లిని ప్రసాద్.. ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఆమె అడ్డుకుని సాయం కోసం కేకలు వేసింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రసాద్ ఇంట్లోని కొడవలి తీసుకుని ఆమెను విచక్షణారహితంగా నరికాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు.

4వ తరగతి విద్యార్థికి లైంగిక వేధింపులు

న్యూఢిల్లీ: నగరంలోని ద్వారకాలోని ఓ ప్రైవేటు పాఠశాలకు పుస్తకాలు సరఫరా చేసే ఓ వ్యక్తి అదే పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థిని(8)పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పాఠశాల యాజమాన్యం, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పాఠశాల ముగిసిన తర్వాత బయటకు వస్తున్న ఆ విద్యార్థిని నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె శరీరభాగాలను తాకుతూ ఆమెను వేధింపులకు గురిచేశాడు. భయాందోళనకు గురైన ఆ విద్యార్థిని తన క్లాస్ టీచర్ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి విషయం చెప్పింది. ఆ తర్వాత తల్లిదండ్రులకు కూడా చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన నిర్వహించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+