దారుణం: వాలెంటైన్స్ డేకు పిలిచి.. నడిరోడ్డుపై భార్య గొంతుకోశాడు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వ్యక్తి తన భార్యను గొంతుకోసి హతమార్చాడు. ఆ తర్వాత రక్తపు మడుగులో ఉన్న భార్యను గట్టిగా కౌగిలించుకొని ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తూనే ఉంటాను' అని నిందితుడు కేకలు వేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు సబ్బీర్(30), మృతురాలు జీనత్‌కు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కొడుకు, కూతురు ఉంది. అయితే ఏ ఉద్యోగం చేయని కారణంగా జీనత్.. సబ్బీర్‌ను విడిచిపెట్టి 13నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. కాగా, వాలెంటైన్స్ డే సందర్భంగా శనివారం జీనత్‌కు ఫోన్ చేసిన సబ్బీర్.. తనను కలవాలని ప్రాధేయపడ్డాడు. తనను ఎప్పుడూ వేధించనని తెలిపాడు.

దీంతో అంగీకరించిన జీనత్ అతన్ని కలిసేందుకు వచ్చింది. శనివారం ఉదయం 11.30గంటల ప్రాంతంలో కలుసుకున్నారు. వారున్న ప్రాంతం ప్రజలతో రద్దీగా ఉంది. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత వారిద్దరు గొడవపడ్డారు.
ఆ తర్వాత తన దగ్గర ఉన్న కత్తిని తీసిన సబ్బీర్.. అత్యంత దారుణంగా జీనత్ గొంతుకోశాడు. అతని వద్ద కత్తి ఉండటంతో పక్కనే వేళ్లేవారెవ్వరూ కూడా అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. ఆమెన హతమార్చిన తర్వాత నిందితుడు సబ్బీర్ ఆమె మృతదేహం పక్కనే కూర్చున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications