భార్యలను మార్చుకుందామంటూ ఒత్తిడి, భరించలేక స్నేహితుడినే లేపేశాడు!

ఇద్దరం మన భార్యలను మార్చుకుందామని స్నేహితుడే పదేపదే చెపుతూ ఒత్తిడి చేయడం భరించలేని మరో స్నేహితుడు ఏకంగా అతన్ని కడతేర్చిన ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది.

ముంబై : ఇద్దరం మన భార్యలను మార్చుకుందామని స్నేహితుడే పదేపదే చెపుతూ ఒత్తిడి చేయడం భరించలేని మరో స్నేహితుడు ఏకంగా అతన్ని కడతేర్చిన ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది.

ముంబై నగరంలోని సబర్బన్ కందివలి ప్రాంతానికి చెందిన షారూఖ్ అన్సారీ, రయీస్ అన్సారీలు స్నేహితులు. తమ మధ్య ఉన్న స్నేహంతో రయీస్ అన్సారీ భార్యలను మార్చుకుందామని (వైఫ్ స్వాపింగ్) పదే పదే షారూఖ్ అన్సారీని అడుగుతున్నాడు.

Man kills friend for asking him to go for 'wife swap'

ఈ ప్రతిపాదన నచ్చని షారూఖ్ అన్సారీ ఆగ్రహం పట్టలేక రయీస్ అన్సారీని మల్వానీలోని అక్సా బీచ్ కు తీసుకువెళ్లి కత్తితో గొంతు కోసి హతమార్చాడు. అక్సా బీచ్ లో రయీస్ అన్సారీ మృతదేహాన్ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు దర్యాప్తులో అనూహ్యంగా భార్యల మార్పిడి ప్రతిపాదన వెలుగుచూసింది. షారూఖ్ అన్సారీని అరెస్టు చేసిన పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని ముంబై పోలీసులు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+