వాదన: మరదలిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు
ముజఫర్‌నగర్: ఓ 55 ఏళ్ల వ్యక్తి తన మరదలిని చంపి ఆ తర్వాత విషం తాగి ఆత్మహత్య చేసుకున్నడాు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాసీపుర గ్రామంలో జరిగినట్లు పోలీసులు మంగళవారంనాడు చెప్పారు.
తన భార్య మరణం తర్వాత నిందితుడు బ్రిజ్‌పాల్ ఊర్మిళతో కలిసి ఉంటున్నాడు. ఊర్మిళ విధవ. అయితే వారిద్దరు పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉంటున్నారు. వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందని, దాంతో బ్రిజ్‌పాల్ ఊర్మిళను నరికి చంపి, తాను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.

ఊర్మిళ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్రిజ్‌పాల్‌పై అతను ఫిర్యాదు చేసినట్లు సర్కిల్ ఆఫీస్ డికె మిట్టల్ మీడియాకు చెప్పాడు.
రెండు శవాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications