డిన్నర్ పెట్టలేదని భార్యను చంపి, శవాన్ని దాచేశాడు

ఆదివారం రాత్రి తాగి వచ్చిన భర్త వర్ఘేష్ (60)కు భోజనం పెట్టడానికి ఆమె నిరాకరించింది. పెట్టుకుని తినాలని చెప్పింది. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. జాలరి అయిన వర్ఘేష్ కత్తి తీసుకుని ఆమె గొంతు కోశాడు. ఆమె శవాన్ని మంచం కింద దాచేసి, సోమవారం తెల్లవారు జామున ఒంటి గంటన్నర సమయంలో చేపలు పట్టడానికి వెళ్లాడు.
ఆ తర్వాత మూడున్నర గంటలకు తిరిగి వచ్చి తన భార్యను ఎవరో చంపారని ఇరుగుపొరుగువారికి చెప్పాడు. అనుమానం వచ్చిన వర్ఘేష్‌ను సుదీర్ఘంగా విచారించారు. అయితే ఆమెను చంపే ఉద్దేశం తనకు లేదని పోలీసులకు చెప్పాడు.
ఆమెను బెదిరించాలని అనుకున్నానని, అయితే బలంగా కత్తి పడడంతో ఆమె మరణించిందని చెప్పాడు. విషయం తెలిస్తే ప్రమాదమని తాను ఎవరికీ విషయం చెప్పలేదని అతను చెప్పాడు. హత్యకు వాడిన కత్తిని పోలీసులు ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications