కొంపముంచిన స్మార్ట్‌ఫోన్: రోజంతా ఆన్‌లైన్లో ఛాటింగ్, భర్త అడిగినా నో, హత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భర్తను, పిల్లలను పట్టించుకోకుండా రోజంతా స్మార్ట్‌ఫోన్లోనే మునిగి తేలుతున్న భార్యను ఓ భర్త హత్య చేశాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకొంది. సోషల్‌మీడియాలో చురుకుగా ఉన్న కారణాన్ని సాకుగా చూపి భర్తను పిల్లలను పట్టించుకోకపోవడంతో భార్యను హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకొన్నాడు.

స్మార్ట్‌పోన్లు సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన తర్వాత సంసారాల్లో చిచ్చులు పెడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను పక్కనపెట్టాలని భర్త పలుమార్లు సూచించినా కానీ ఆమె పట్టించుకోలేదు. ఆమెను మార్చేందుకు భర్త చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

గురుగ్రామ్‌కు చెందిన హరీఓం అనే వ్యక్తి కంప్యూటర్ రిపేర్లు చేస్తుంటారు. ఆయనకు లక్ష్మీ అనే యువతితో 2006లో వివాహమైంది వారికి ఇద్దరు పిల్లలున్నారు. కొన్నాళ్ళపాటు సజావుగానే సాగింది. స్మార్ట్‌ఫోన్ వారి సంసారంలో చిచ్చును పెట్టింది.

స్మార్ట్‌ఫోన్ దెబ్బకు సంసారంలో నిప్పులు

స్మార్ట్‌ఫోన్ దెబ్బకు సంసారంలో నిప్పులు

స్మార్ట్‌ఫోన్‌ ప్రభావం హరిఓం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. కంప్యూటర్ రిపేరింగ్ సెంటర్ నిర్వహించుకొనే హరిఓం తన భార్య లక్ష్మికి 2 ఏళ్ళ క్రితం స్మార్ట్‌ఫోన్ కొనిచ్చాడు. స్మార్ట్ ఫోన్ వచ్చిననాటి నుండి లక్ష్మీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. నిత్యం ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియాల్లో ఆమె యాక్టివ్‌గా ఉండేది. ఆన్‌లైన్ ఛాటింగ్‌లలో బిజీగా గడిపేది. దీంతో పిల్లలను స్కూల్ పంపకపోవడం, వంట చేయకపోయేదని హరిఓం తరచూ ఆమెతో గొడవపడేవాడు.దీంతో భార్య,భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

రాత్రిపూట కూడ ఛాటింగ్

రాత్రిపూట కూడ ఛాటింగ్

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉందనే కారణంగా రాత్రిపూట కూడ లక్ష్మీ ఆన్‌లైన్లో చాటింగ్ చేసేది. సోషల్ మీడియాను ఆమె వ్యసనంగా మార్చుకొంది. కనీసం వంట చేయకపోవడం వల్ల పిల్లలు ఇబ్బందిపడేవారు. పిల్లల పరిస్థితిని గమనించిన హరిఓం వారిని రెసిడెన్షియల్ స్కూల్‌లో చేర్చారు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు.

సోషల్ మీడియా ఖాతాలు చూపించదు

సోషల్ మీడియా ఖాతాలు చూపించదు

లక్ష్మీ ఉపయోగిస్తున్న సోషల్ మీడియా ఖాతాను ఆమె రహస్యంగా ఉంచేది.ఈ విషయమై భర్త ప్రశ్నించినా ఆమె సమాధానం చెప్పకపోయేది. చాటుమాటుగా ఆమె ఇతరులతో ఛాటింగ్ చేస్తోందని హరిఓం అనుమానించాడు. లక్ష్మిని అంతం చేయాలని ప్లాన్ చేశాడు.

లక్ష్మిని హత్య చేసిన హరిఓం

లక్ష్మిని హత్య చేసిన హరిఓం

సోషల్ మీడియాకు బానిసగా మారి తనతో పాటు పిల్లలను కూడ పట్టించుకోవండం మానేసిన లక్ష్మిని పథకం ప్రకారం హరిఓం హత్య చేశాడు. పడుకొన్న సమయంలో లక్ష్మిని హత్య చేశాడు.ఇతరులతో చాటు మాటు వ్యవహరాలు నడుపుతోందనే అనుమానం కూడ తోడు కావడంతో హరిఓం ఈ మేరకు లక్ష్మిని హత్య చేశాడు. లక్ష్మి తండ్రి ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో తానే లక్ష్మిని హత్య చేసినట్టు హరిఓం ఒప్పుకొన్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It was Luxmi’s addiction to Facebook and WhatsApp that ultimately led to her murder, claimed her husband Hariom who strangled her in sleep last Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి