పెళ్లయిన కొద్దిరోజులకే 8నెలల గర్భం: షాక్ తిన్న భర్త.. అసలు నిజం ఏంటంటే?

Subscribe to Oneindia Telugu

మండ్య: తాను గర్భవతిని అన్న విషయం దాచిన ఓ యువతి.. విధి లేని పరిస్థితుల్లో మరో యువకుడితో వివాహనికి ఒప్పుకుంది. తీరా పెళ్లయ్యాక.. అసలు విషయం బయటపడటంతో భర్త తరుపు బంధువులు ఆమెను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నాగమంగళ తాలుకాలోని బిండేనహళ్లి గ్రామానికి చెందిన యువతికి మండ్య తాలుకాలోని దొడ్డగరుడనహళ్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడితో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో.. చంద్రశేఖర్ తో యువతి శారీరకంగా దగ్గరైంది. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చగా..ప్రియుడు చంద్రశేఖర్ ముఖం చాటేశాడు.

man makes woman pregnant on the name of love

ఈ విషయం తెలియని ఆమె కుటుంబ సభ్యులు యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయం చేశారు. కసళగెరె గ్రామానికి చెందిన యువకుడి(30)తో ఈ నెల 8న వివాహం జరిపించారు. పెళ్లయ్యాక కొద్దిరోజులకే యువతిలో శారీరకంగా మార్పులు రావడం పట్ల భర్తకు, అతని కుటుంబ సభ్యులకు అనుమానం మొదలైంది. దీనిపై యువతిని గట్టిగా నిలదీయక.. ఆమె 8నెలల గర్భవతి అని తేలింది. చంద్రశేఖర్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని తెలియడంతో.. యువతి తల్లిదండ్రులు అతనిపై కేసు పెట్టారు. ప్రస్తుతం చంద్రశేఖర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man cheated a woman on the name of love in Mandya district in Karnataka state. She was pregnant by him but she hide the fact and married another
Please Wait while comments are loading...