స్కూటీ కొందని భార్యపై యాసిడ్ దాడి: తనూ తాగేశాడు

Man pours bottle of acid on wife
లక్నో: తన భార్య తనకు తెలియకుండా స్కూటీ కొందని ఆగ్రహానికి గురైన భర్త ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అనంతరం అతను మరో యాసిడ్ సీసాను తీసుకొని యాసిడ్‌ను తాగేశాడు. ఈ దిగ్భ్రాంతికర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బాధితుల అరుపులు విన్న వారి కుటుంబ సభ్యులు వారిని హుటాహుటిన బహ్రెయిన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

కాగా ఘటనకు సంబంధించిన వివరాలను బాధితురాలు పోలీసులకు వివరించింది. మనేరా రాణియాపూర్ గ్రామానికి చెందిన హవల్దార్ శుక్లా (40) ఎకౌనా బజార్‌లో బట్టలు అమ్ముతూ జీవిస్తున్నాడు. అతని భార్య దీపమాల (35) జూనియర్ పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది. శనివారం ఉదయం తాను తన భర్తకు టీ ఇవ్వడానికి వెళ్లానని దీపమాల తెలిపింది. అదే సమయంలో తనపై తన భర్త యాసిడ్ పోశాడని పేర్కొంది.

ఆ తర్వాత మరో యాసిడ్ బాటిల్ తీసుకుని తన భర్త యాసిడ్‌ను తాగేశాడని బాధితురాలు దీపమాల తెలిపింది. తమ అరుపులను విన్న కుటుంబ సభ్యులు తమను సమీపంలోని ఎకౌనా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‍‌కి తరలించారని పేర్కొంది. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం తమను బహ్రెయిచ్ జిల్లా ఆస్పత్రికి తరలించారని తెలిపింది.

కాగా జిల్లా ఆస్పత్రిలో బాధితులిద్దరూ చికిత్స పొందుతున్నారు. దీపమాల శరీరం 60 శాతం కాలిపోయిందని, ముఖంపై, తన భుజం కింది భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. దీపమాల భర్త శుక్లా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+