వరసకు కూతురు, లవ్, ఎస్కేప్: పోలీస్ స్టేషన్ ముందు ధర్నా, పెళ్లి చెయ్యండి, అమ్మాయి !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: వరసకు కూతురు అయ్యే యువతిని ప్రేమించిన యువకుడు ఆమెతోనే తనకు పెళ్లి చెయ్యాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న ఘటన కర్ణాటకలోని బాగలకోటేలో జరిగింది. నవనగర పోలీస్ స్టేషన్ ముందు సాగర్ అలియాస్ సాగర్ సుగేతేకర (21) అనే యువకుడు ధర్నాకు చేస్తున్నాడు. అమ్మాయి మాత్రం మాయం అయ్యింది.

ఏడాది నుంచి లవ్ !

ఏడాది నుంచి లవ్ !

సాగర్, 19 ఏళ్ల యువతి గత సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ సినిమాలు, షికార్లకు తిరిగారు. నిత్యం మొబైల్ లో చాటింగ్ చేశారు. బాగలకోటే జిల్లాలోని అనేక ప్రాంతాలకు వెళ్లి సెల్ఫీలు తీసుకుని స్నేహితులకు షేర్ చేశారు.

కథ అడ్డం తిరిగింది

కథ అడ్డం తిరిగింది

సాగర్, యువతి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. పెళ్లి విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. మీరు వరసకు చిన్నాన, కుమార్తె అవుతారని, పెళ్లి చెయ్యడానికి వీలు లేదని కుటుంబ సభ్యులు, బంధువులు తేల్చి చెప్పారు.

 లవర్స్ ఎస్కేప్

లవర్స్ ఎస్కేప్

తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని నిర్ణయించిన యువతి, సాగర్ ఇటీవల ఇంటి నుంచి పారిపోయి స్నేహితుల దగ్గర తలదాచుకున్నారు. సాగర్, యువతి ఇంటి నుంచి పారిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో వారి కోసం గాలించారు.

పెళ్లి చేస్తాం రండి !

పెళ్లి చేస్తాం రండి !

నాలుగు రోజుల క్రితం సాగర్, యువతిని సంప్రధించిన వారి కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తామని నమ్మించి ఒత్తిడి చేసి నవనగర పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పంచాయితీ పెట్టారు. మరుసటి రోజు విచారణ చేస్తామని పోలీసులు అక్కడి నుంచి పంపించారు.

ప్రియుడి ధర్నా !

ప్రియుడి ధర్నా !

ఒక సంవత్సరం నుంచి కలిసి తిరిగామని, ఆమె లేకపోతే నేను జీవించలేనని, మూడు రోజులు అయినా యువతి, ఆమె కుటుంబ సభ్యులను ఎందుకు పిలుచుకుని వచ్చి విచారణ చెయ్యలేదని సాగర్ పోలీసులను ప్రశ్నించాడు. పోలీసుల తీరుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ముందే సాగర్ ధర్నా చేస్తున్నాడు.

 యువతి మాయం

యువతి మాయం

సాగర్ ప్రేమించిన అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి మాయం అయ్యారు. ఎవ్వరితో సంబంధాలు లేకుండా కుటుంబ సభ్యుల అందరి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. అయితే యువతిని తీసుకు వచ్చి పెళ్లి చేసే వరకూ తాను ధర్నా విరమించనని చెప్పిన సాగర్ పోలీస్ స్టేషన్ ముందే ధర్నా చేస్తున్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Man Protest for police help to marry a loved Girl in Bagalkote district in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి