కేంద్రమంత్రి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు: మద్యం మత్తులో క్యాబ్ డ్రైవర్

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఓ క్యాబ్ డ్రైవర్ మద్యం మత్తులో కారు నడిపి ఏకంగా కేంద్రమంత్రి ఇంట్లోకే దూసుకెళ్లాడు. దీంతో ఆ ఇంటి ప్రహారీని ఢీకొట్టింది. అక్కడేవున్న సీఐఎస్ఎఫ్ అధికారులను కూడా ఢీకొనడంతో వారికి కూడా గాయాలయ్యాయి.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని లుటిన్స్‌లోగల కృష్ణమీనన్ మార్గ్‌లో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అధికారిక నివాసం ఉంది. గత శనివారం మద్యం మత్తులో ఉన్న క్యాబ్ డ్రైవర్.. ఆ ఇంట్లోకి కారుతోపాటు దూసుకెళ్లాడు.

Man rams car into wall of Kiren Rijiju’s residence, arrested

వేగంగా ప్రహారీ గోడను ఢీకొట్టడంతోపాటు అక్కడేవున్న సీఐఎస్ఎఫ్ జవాన్లను కూడా ఢీకొట్టింది కారు. దీంతో వారికి గాయాలయ్యాయి. కాగా, కారు ప్రహారీని ఢీకొట్టిన సమయంలో అతడితో ఓ మహిళ కూడా ఉంది. డ్రైవర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా.. మద్యం సేవించినట్లు తేలింది.

కాగా, ప్రమాద ఘటనలో గాయపడిన సౌరబ్కుమార్ గౌతమ్ అనే సీఐఎస్ఎఫ్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A taxi driver, who crashed his vehicle into the wall of Union Minister Kiren Rijiju’s official residence in Lutyens’ Delhi, was arrested on Monday, news agency PTI reported. A CISF personnel guarding Rijiju’s house was injured in the incident that occurred on Saturday.
Please Wait while comments are loading...