భార్యపై అనుమానం: కూతుర్ని రేప్ చేసి చంపేశాడు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. కన్న కూతురిపై అత్యాచారం చేసి ఆమెను చంపేశాడు.

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. కన్న కూతురిపై అత్యాచారం చేసి ఆమెను చంపేశాడు. ఆ పాప తనకు పుట్టలేదని, తన భార్యకు అక్రమ సంబంధం వల్ల పుట్టిందని అనుమానించిన అతను ఆ ఘాతుకానికి ఒడిగట్టాడు

ఆరేళ్ల చిన్నారి ఆత్మహత్య చేసుకుందని తొలుత భావించారు. ఆరేళ్ల చిన్నారి ఏడు నెలల క్రితం మరణించింది. ఇప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తండ్రే బాలికపై అత్యాచారం చేసి ఆమెను కిరాతకంగా చంపేశాడని, భార్యపై అనుమానంతో ఆ పనిచేశాడని పోలీసు దర్యాప్తులో తేలింది.

అతని అరెస్టు...

అతని అరెస్టు...

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారులోని బారేలా గ్రామానికి చెందిన బాలిక తండ్రిని పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు. మార్చి 15వ తేదీన మైనర్ బాలిక శవం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో బాలిక ఆత్మహత్య చేసుకుందని అనుకుననారు.

ఇలా అనుమానం....

ఇలా అనుమానం....

బాలిక శవానికి పోస్టుమార్టం నిర్వహించడాన్ని తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దానికితోడు, బాలిక శవం వేలాడుతున్న సీలింగ్ ఫ్యాన్ చాలా ఎత్తులో ఉంది. దాన్ని అందుకోవడానికి బాలిక ఎత్తు సరిపోయే విధంగా లేదు. దానివల్ల పోలీసులు పోస్టుమార్టం చేయాలని నిర్ణయించుకుననారు.

శరీరంపై వీర్యం.

శరీరంపై వీర్యం.

బాలిక ప్రైవేట్ భాగాలపై వీర్య కణాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో బయటపడింది. వీర్యానికి బాలిక తండ్రి డిఎన్ఎ సరిపోయింది. దాంతో తండ్రే బాలికపై అత్యాచారం చేసి, ఆమెను చంపేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నేరాన్ని అంగీకరించాడు.

తల్లిని షాపింగ్‌కు పంపించి...

తల్లిని షాపింగ్‌కు పంపించి...

అతను తన భార్యను షాపింగ్‌కు పంపించి, కూతురిపై అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలింది. స్పృహ కోల్పోయిన బాలికను నిందితుడు సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశాడు. శవం కింద భారీ యెత్తున దుస్తుల మూటలు పెట్టాడు. ఆత్మహత్య చేసుకుందని నమ్మించడానికి అతను అలా చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+