ప్రేయసిని 50 సార్లు కత్తెరతో పొడిచి చంపాడు

ప్రముఖ టెలికం కంపెనీలో పనిచేస్తున్న 23 ఏళ్ల బల్బీర్ కౌర్ ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఇంటికి రాలేదు. మర్నాడు తండ్రి ఫిర్యాదు చేయడంతో ఓఖ్లా ఇండిస్ట్రియల్ ఏరియా పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకున్నారు. అనీష్ నెంబర్ దొరకడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. అతను కూడా అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. హరిద్వార్, హృషికేష్, తదితర ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో అతను తిరుగుతున్నాడు.
పోలీసులు దాడి చేసి బుధవారంనాడు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నేరాన్ని అంగీకరించాడు. రెండు నెలల క్రితమే ఆమెను చంపాలని నిర్ణయించుకుని గోవింద్‌పురిలో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నట్లు చెప్పాడు. బుధవారంనాడు అతన్ని తీసుకుని పోలీసులు ఆ ఫ్లాట్‌కు వెళ్లారు. ఫ్లాట్‌లో కుళ్లిపోయిన స్థితిలో అమ్మాయి శవం కనిపించింది.
ఫ్లాట్‌కు రావాలని అనీష్ ఆమెపై ఒత్తిడి చేస్తూ వచ్చాడు. కానీ ఆమె అందుకు నిరాకరిస్తూ వచ్చింది. ఏప్రిల్ 23వ తేదీన ఏదో విధంగా ఆమెను ఒప్పించి ఫ్లాట్‌కు తీసుకుని వచ్చాడు. కత్తెరను రెండుగా చీల్చి రెండు కత్తులుగా చేశాడు.
తనను పెళ్లి చేసుకోవాలని అతను తీవ్రంగా ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించింది. దాంతో అతను కత్తెరతో చేసిన కత్తులతో పొడిచాడు. స్పృహ కోల్పోయిన ఆమెను అక్కడే వదిలేసి ఫ్లాట్‌కు బయటి నుంచి తాళం వేసి హరిద్వార్‌కు పారిపోయాడు.












Click it and Unblock the Notifications