ప్రియురాలి కోసం తండ్రినే బురిడీ కొట్టించాడు.. ఎలాగో తెలిస్తే షాక్!

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రేయసి కోసం తండ్రినే బురిడీ కొట్టించేశాడు ఓ కొడుకు. తండ్రి వద్ద నుంచి మొబైల్ ఫోన్ దొంగిలించి.. ప్రియురాలి బర్త్ డే సందర్బంగా దాన్ని గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. ఇక్కడిదాకా అంత బాగానే ఉందనుకున్నాడు గానీ.. ఫోన్ కొట్టేసింది కొడుకని తెలియక సదరు తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. రామ్ శంకర్ అనే వ్యక్తి ఢిల్లీలోని ప్రేమ్ నగర్ మార్కెట్ లో కూరగాయలు కొనడానికి వెళ్లాడు. జనం రద్దీ ఎక్కువగా ఉండటంతో.. అతని మొబైల్ ఫోన్ ను ఎవరో దొంగిలించారు. దీంతో రామ్ శంకర్ బేగంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు దొంగ రామ్ శంకర్ కొడుకేనని తేలింది.

Man steals dad's phone to impress girlfriend

ప్రియురాలి పుట్టినరోజు నాడు బహుమతి ఇవ్వాలన్న ఉద్దేశంతో తండ్రి సెల్ ఫోన్ ను చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే తన సెల్ ఫోన్ మార్కెట్ లో చోరీకి గురైందంటూ తప్పుడు ఫిర్యాదు చేశానని రామ్ శంకర్ సైతం అంగీకరించడం గమనార్హం. కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ ఎంఎన్ తివారీ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 22-year-old youth was arrested for stealing his father's phone in northwest Delhi's Begampur as he was short of cash and wanted to give a present to his girlfriend on her birthday.
Please Wait while comments are loading...