8ఏళ్ల గర్ల్‌ను ఈడ్చుకెళ్లారు, ఆ స్కూల్‌కు పంపించమని..
బెంగళూరు: ఎనిమిదేళ్ల బాలికతో మిస్ బిహేవ్ చేసిన ఓ తాగిన వ్యక్తిని చితకబాది, పోలీసులకు అప్పగించిన సంఘటన కర్నాటకలో ఆదివారం జరిగింది. ఈ సంఘటన కొననకుంటే క్రాస్ రోడ్డు వద్ద రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ బాలిక తన తాతయ్యతో కలిసి కూరగాయలు కొనేందుకు బయటకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సూరజ్ అనే వ్యక్తి నగరంలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనితో పాటు మరో ఇద్దరు ఓ ద్విచక్ర వాహనం పైన వచ్చారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తాతయ్యను నెట్టివేశారు. అనంతరం బాలికను కొంతదూరం లాక్కెళ్లారు. దీంతో పాప తాత కేకలు వేశాడు.
స్థానికులు సూరజ్‌ను పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే, అతనితో పాటు వచ్చిన ఇద్దరు తప్పించుకున్నారు. సుబ్రహ్మణ్యపుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

ఆ పాఠశాలకు పంపించం!
చిన్నారి పైన అత్యాచారానికి పాల్పడిన పాఠశాలకు తాము తమ పిల్లలను పంపించమని కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇటీవల బెంగళూరులో ఐదేళ్ల చిన్నారి పైన ఉపాధ్యాయుడు దారుణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ స్కూల్ ఇప్పుడు పునఃప్రారంభమైంది. ఐదో తరగతి నుండి పదో తరగతి వరకు మాత్రమే తెరిచారు. రెండు రోజుల తర్వాత ప్రాథమిక విభాగాన్ని తెరుస్తారు.
ఆదివారం వందమందికి పైగా తల్లిదండ్రులు పాఠశాలలో చేపట్టిన భద్రతాచర్యలను పరిశీలించారు. పాఠశాలలో మొత్తం 110 సీసీటీవీలను యాజమాన్యం అమర్చింది. పిల్లల భద్రతకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తల్లిదండ్రులకు తెలిపింది. అయినా సరే, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపించేందుకు ఇష్టపడటం లేదు. తమ పిల్లలను మరో పాఠశాలకు పంపిస్తామన్నారు.












Click it and Unblock the Notifications