కేజ్రీవాల్‌ను కాల్చిపారేస్తానని అగంతకుడి బెదిరింపు కాల్
న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కాల్చిపారేస్తానంటూ.. ఫోన్ కాల్ రావడంతో.. ఒక్కసారిగా ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడి గురించి ఆరా తీయగా.. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఓ మతిస్థిమితం లేనివాడని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

బుధవారం మధ్యాహ్నాం చంఢీఘడ్ నుంచి ఢిల్లీకి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు సీఎం కేజ్రీవాల్. ఇదే క్రమంలో సాయంత్రం 6.16గం.ల ప్రాంతంలో ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. కేజ్రీవాల్ ఢిల్లీలో అడుగుపెట్టగానే కాల్చిపారేస్తానని అవతలి వైపు నుంచి ఓ అగంతకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు.
క్షణాల వ్యవధిలో పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ఉన్నతాధికారులు.. నిందితుడి గురించి వివరాలు సేకరించారు. నిందితుడు తూర్పు ఢిల్లీలోని ఖజూరి ఖాస్ కు చెందిన రవీందర్ కుమార్ అనే వ్యక్తిగా గుర్తించారు. అయితే అతనో తాగుబోతని, మతిస్థిమితం సరిగా లేక అలా వ్యవహరిస్తున్నాడని స్థానికులు పోలీసులకు వివరించారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications