దుర్మార్గుడు: పిల్లలు అల్లరి చేశారని ఏం చేశాడో తెలుసా..? అత్యంత దారుణంగా...!

కోల్‌కతా: పిల్లలు అన్నాక అల్లరి చేయరా ఏంటి..? అల్లరిని ఆస్వాదించాలే కానీ పెద్దలుగా ఉండి వారిపై భౌతిక దాడి చేయడం తగదు. పిల్లలు మరీ అల్లరి చేస్తే కాస్త భయం పెట్టి వారిని కంట్రోల్ చేయాలి గానీ వారిపై దాడి చేయరాదు. ఇక లాక్‌డౌన్ ఉండటం పిల్లలు ఇళ్లకే పరిమితం అవడంతో వారి అల్లరి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆ పోటును తట్టుకోవడం తల్లిదండ్రులకు కాస్త కష్టమే అయినప్పటికీ కొంత ఓర్పు వహించాల్సి ఉంటుంది. తాజాగా కోల్‌కతాలో ఓ వ్యక్తి పిల్లలు అల్లరి చేస్తుంటే ఏం చేశాడో తెలుసా..? విసిరేశాడు.. ఎక్కడి నుంచో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

అల్లరి చేస్తున్న పిల్లలను...

అల్లరి చేస్తున్న పిల్లలను...

లాక్‌డౌన్ నేపథ్యంలో పిల్లలంతా ఇళ్లకే పరిమితం కావడం ఇంట్లోనే ఉంటూ ఆడుకోవడం చేస్తున్నారు. అయితే కోల్‌కతాలోని బుర్రాబజార్ ఏరియాలో నివాసం ఉంటున్న శివకుమార్ గుప్తా అనే 55 ఏళ్ల వ్యక్తి అల్లరి చేస్తున్న ఇద్దరు పిల్లలను అమాంతంగా నాల్గవ అంతస్తు నుంచి కిందకు పడివేశాడు. ఈ ఘటన ఆదివారం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఇద్దరి పిల్లలను పై అంతస్తు నుంచి కిందకు పడేయడంతో రెండేళ్ల బాలుడు మృతి చెందగా ఆరేళ్ల అబ్బాయికి తీవ్రగాయాలయ్యాయి. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు శివకుమార్ గుప్తాను అరెస్టు చేసి లాల్‌బజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నేరం అంగీకరించిన నిందితుడు

నేరం అంగీకరించిన నిందితుడు

పోలీసుల విచారణలో శివకుమార్ గుప్త నేరం అంగీకరించాడు. ఇక గాయపడిన అబ్బాయి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉందని వైద్యులు చెప్పినట్లు పోలీసులు చెప్పారు. శివకుమార్ పైనుంచి తమ పిల్లలను తోసేశాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు శివకుమార్‌ను విచారణ చేయగా తను నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే పిల్లలకు ఎంత చెప్పినా వినలేదని వారి అల్లరితో విసిగి వేశారిపోయినందునే కిందకు పడేసినట్లు విచారణలో శివకుమార్ చెప్పాడని పోలీసులు వెల్లడించారు.

Recommended Video

    China Reports New COVID-19 Cases Again!
     పోలీసులు ఏం చెప్పారు..?

    పోలీసులు ఏం చెప్పారు..?

    కొద్ది రోజుల క్రితమే పిల్లలకు శివకుమార్‌కు మధ్య వాగ్వాదం జరిగిందని పోలీసులు చెప్పారు. అయితే పిల్లల తల్లిదండ్రులు జోక్యం చేసుకోగా అది సద్దుమణిగిందని పోలీసులు చెప్పారు. అయితే ఆదివారం రోజున తిరిగి పిల్లలు నాల్గవ అంతస్తులో అల్లరి చేస్తున్న సమయంలో వారి అల్లరి భరించలేక పైకి వెళ్లిన శివకుమార్ కోపోద్రిక్తుడై ఆ పిల్లలను పట్టుకుని పై నుంచి కిందకు పడేశాడని పోలీసులు తెలిపారు. పిల్లలను ఇద్దరిని దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా రెండేళ్ల పిల్లవాడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించగా మరో అబ్బాయికి గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు.

    వార్త తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజెన్లు


    ఇదిలా ఉంటే తమ పొరిగింటి వారితో తరుచూ శివకుమార్ గుప్తా గొడవపడేవాడని విచారణలో తేలినట్లు పోలీసులు చెప్పారు. అయితే పోలీసులు వచ్చేలోపే పొరుగింటివారు శివకుమార్‌ను చితకొట్టినట్లు సమాచారం. చిన్నారి ప్రాణం తీసిన శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కోల్‌కతా పోలీసులు తమ అధికారిక ట్విటర్‌లో పోస్టు చేయగా నెటిజెన్లు చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. అలాంటి దుర్మార్గుడికి కఠిన శిక్ష పడాలంటూ మండిపడ్డారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+