వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజ జీవిత గాధ: మోడీ డిజిటల్ ఇండియా పవరే ఇదే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియాకు ఇదొక చక్కని ఉదాహరణగా నిలిచే సంఘటన ఇది. ఇంటర్నెట్ సాయంతో కష్టాల్లో ఉన్న ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్‌కు భారతీయ రైల్వే తక్షణమే స్పందించి సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కర్ణాటకలో స్థిరపడ్డ ఓ రాజస్థాన్ బిజినెస్ మ్యాన్ పంకజ్ జైన్. కుటుంబంతో కలిసి యశ్వంత్ పూర-బికనూర్ ఎక్స్ ప్రెస్ రైల్లో సొంతూరుకు బయల్దేరాడు. తనతో పాటు పక్షవాతం సోకిన తండ్రి, తల్లి, కుటుంబ సభ్యులున్నారు. తన స్వగ్రామానికి చేరుకోవాలంటే పంకజ్ రాజస్థాన్‌లోని మెర్టా రైల్వే స్టేషన్‌లో దిగాలి.

Man tweets about ailing father to railways, Prabhu helps

ఈ స్టేషన్‌లో ఐదు నిమిషాలు మాత్రమే రైలు ఆగుతుంది. దీంతో తనతో పాటు ఉన్న పక్షవాతం వచ్చిన తన తండ్రిని, లగేజీని దించడం ఎలాగా అని ఆందోళన చెందాడు. ఈ క్రమంలో రైల్ కోచ్‌లో ఉన్న మిత్రుల సలహా మేరకు తన సమస్యను తెలియజేస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో పాటు భారతీయ రైల్వే శాఖకు ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌ని వీక్షించిన సురేష్ ప్రభు విషయాన్ని రైల్వే శాఖకు తెలిపారు. ఐదు నిమిషాల్లో స్పందించిన రైల్వే శాఖ అతను ప్రయాణిస్తున్న కోచ్ నెంబర్, పీఎన్ఆర్ నెంబర్ పంపాలని కోరింది. దీంతో రైలు మెర్టా రోడ్డు స్టేషన్‌కు చేరేసరికి ప్లాట్ ఫామ్‌పై స్టేషన్ మాస్టర్, సిబ్బంది, ఓ కూలి వీల్ చైర్ తో సిద్ధంగా ఉన్నారు.

రైలుని పది నిమిషాల పాటు ఆపిన స్టేషన్ మాస్టర్ కూలీ సాయంతో లగేజీని, తండ్రిని కోచ్ నుంచి దింపేందుకు సాయపడ్డారు. రైల్వే శాఖ స్పందనకు ఆశ్చర్యపోయిన పంకజ్ జైన్ వారికి కృతజ్ఞతలు చెప్పాడు.

English summary
A man who tweeted to Railway Minister Suresh Prabhu seeking help to deboard his father, suffering from paralysis, was pleasantly surprised to find assistance waiting for him on his arrival at a Rajasthan station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X