ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య: నిందితుడి పట్టివేత
చెన్నై: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని రామ్‌కుమార్ (22)గా గుర్తించారు. అతన్ని తమిళనాడులోని తిరునల్వేలీలో పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. స్వాతిని జూన్ 24వ తేదీన అందరూ చూస్తుండగానే చెన్నై రైల్వే స్టేషన్‌లో హత్య చేసిన విషయం తెలిసిందే.
హత్యలో ట్విస్ట్‌లు: ముందే ఇన్ఫోసిస్ టెక్కీని కొట్టాడు, ఆ 2 ఘటనలు..

రామ్ కుమార్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అతను తిరునల్వేలీలోని సెంగట్టాయ్‌కి చెందినవాడు. పోలీసులను చూసి అతను గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. అతన్ని పోలీసులు తిరునల్వేలీలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి నిలకడగానే ఉంది.
ప్లాన్ ప్రకారమే ఇన్ఫోసిస్ టెక్కీ హత్య: 5 లక్షల ఫోన్ కాల్స్ విశ్లేషణ

అతను ఉద్యోగం కోసం చెన్నై వచ్చాడని, స్వాతి ఉంటున్న హాస్టల్ ప్రాంతంలోనే ఉన్నాడని చెబుతున్నారు. అతను నెలల తరబడి స్వాతి వెంటపడినట్లు చెబుతున్నారు. అతను తన వెంటపడుతున్న విషయం స్వాతికి కూడా తెలుసునని ఆమె స్నేహితురాలి మాటలను బట్టి తెలుస్తోంది.
ఫాలో అయింది అతనే: ఇన్ఫోసిస్ టెక్కీ హత్యపై ఫ్రెండ్, హైదరాబాద్ సంస్థ సాయం

చెన్నైలోని నుంగబాక్కం రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫాం నెంబరు 2లో నిరీక్షిస్తుండగా దుండగుడు దాడి చేసి హత్య చేశాడు. స్వాతి వద్దకు వచ్చి గొడవ పడి అనూహ్యంగా పొడిచి చంపినట్లు తెలుస్తోంది.
స్వాతిని రామ్ కుమార్ ఎందుకు హత్య చేశాడనే విషయాన్ని కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతను ఎందుకు ఈ హత్య చేశాడో ఇప్పుడే చెప్పలేమని పోలీసులు అంటున్నారు. హత్య చేయడానికి అతనికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాపు్తు చేస్తున్నారు.
పోలీసులను చూసి గొంతు కోసుకున్న రామ్ కుమార్‌కు వైద్యులు కంఠం వద్ద శస్త్ర చికిత్స చేశారు. మరో 24 గంటల వరకు రామ్ కుమార్‌ను మాట్లాడించవద్దని, లేదంటే ప్రాణాలకు హాని కలగవచ్చునని వైద్యులు పోలీసులకు చెప్పారు.
అందరూ చూస్తుండగానే దారుణంగా హతమార్చి రైల్వే పట్టాలు దాటివెళ్లిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. బ్లూ చెక్ షర్టు ధరించి, భుజాన బ్యాగ్ తగిలించుకొని వెళుతున్న యువకుడే స్వాతి హంతకుడని పోలీసులు విడుదల చేసిన సీసీ టీవీ ఫుటేజ్ ను చెన్నైసోని ఇంటింటికి ప్రచారం చేశారు.
ఇంటి యజమాని చెప్పిన వివరాల మేరకు దర్యాప్తు సాగించగా 22 ఏళ్ల రామ్ కుమార్ చెన్నైకి 650 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన రామ్ కుమార్ గత మూడు నెలలుగా మరో యువకుడితో కలిసి షేరింగ్లో రూమ్ లో ఉంటున్నాడని పోలీసుల విచారణలో తేలింది.
రామ్ కుమార్ నివాసముంటున్న గదిలో స్వాతిని హతమార్చినపుడు ధరించిన బ్లూ చెక్స్ షర్టును స్వాధీనం చేసుకున్నారు. తిరునెల్వేలిలో రామ్ కుమార్‌కు తల్లితండ్రులు, సోదరుడు, సోదరి ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. తాము రామ్ కుమార్‌ను ఎన్నడూ చూడలేదని స్వాతి తల్లిదండ్రులు అంటున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications