వారిపై కేసు వేస్తాం: బియాస్‌ ట్రాజెడీపై నాయని

Manali: Telangana govt to sue dam officials, college authorities
మనాలి: నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణతో మనాలి డ్యామ్ అధికార యంత్రాంగంపై, కళాశాల యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం కేసు వేయనుంది. లర్జీ డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తడంతో వరదలు వచ్చేసి 24 మంది హైదరాబాదు విద్యార్థులు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.

అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కారణమైన హిమాచల్ ప్రదేశ్ డ్యాం అధికార యంత్రాంగంపై, విఎన్నార్ విజ్ఞాన జ్యోతి కాలేజీపై కేసులు వేస్తామని తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి చెప్పారు. పారిశ్రామిక శిక్షణ యాత్రకని చెప్పి వినోద యాత్రకు విద్యార్థులను తీసుకుని వెళ్లినందుకు కళాశాల యాజమాన్యంపై కేసు వేస్తామని ఆయన చెప్పారు.

బియాస్ నదిలో వచ్చిన వరదకు 24 మంది విద్యార్థులు కొట్టుకుని పోగా, ఇప్పటి వరకు ఆరుగురి శవాలను వెలికి తీశారు. ఇంకా గాలింపు జరుగతోంది. ఆదివారం సాయంత్రం ఆ ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనపై ఆరు రోజుల లోగా నివేదిక సమర్పించాని హిమాచల్ ప్రదేశ్ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఏ విధమైన హెచ్చరికలు లేకుండానే లర్జీ డ్యామ్ గేట్లను అధికారులు ఎత్తారు. దీంతో అకస్మాత్తుగా వరదలు ముంచుకొచ్చాయని అంటున్నారు. ముందు హెచ్చరికలు చేసినట్లు, వాటిని బహుశా విద్యార్థులు విని ఉండకపోవచ్చునని డిజిపి అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+