సైలెంట్ గా స్కెచ్ వేసిన సీఎం, మోదీ, మాజీ సీఎం టార్గెట్, ఆయన ఎంట్రీతో సీన్ మారుతుందా !
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఫిరాయింపుల జోరు మరింత ఎక్కువైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీజేపీ, జేడీఎస్ లు ఇప్పుడు లోక్ సమరానికి ఏకం అయ్యి విజయం మాదే అనే మంత్రాన్ని జపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెక్ పెట్టడానికి బీజేపీ, జేడీఎస్ నాయకులు ఒక్కటవుతుండగా వారిని కట్టడి చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సైలెంట్‌గా ఆపరేషన్ హస్తం ప్రారంభించింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో చాలా సందడి చేసిన నియోజకవర్గం మండ్య అని కొత్తగా చెప్పనవసరం లేదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా మండ్య నియోజక వర్గం హాట్ టాపిక్ గా నిలిచింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నియోజకవర్గంపై పట్టు సాధించాలని బీజేపీ-జేడీఎస్ పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగడంతో మండ్య లోక్ సభ నియోజక వర్గంమీద తీవ్ర ఆసక్తి నెలకొంది.

బీజేపీ, జేడీఎస్ కూటమి మాజీ మంత్రి కె.సీ. నారాయణ గౌడ్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఈ వ్యతిరేకత వెనుక హస్తం వ్యూహం దాగి ఉందని కర్ణాటక రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో బీజేపీ నేత, మాజీ మంత్రి నారాయణ గౌడ్ బీజేపీని వీడాలని భావిస్తున్నారు. మండ్య జిల్లాలో తొలిసారిగా జేడీఎస్ కంచుకోటలో కేసీ. నారాయణ గౌడ్ బీజేపీ జెండా ఎగరవేశారు. అయితే ఇప్పుడు మళ్లీ అదే నారాయణ గౌడ మళ్లీ ఫిరాయింపులకు సిద్ధమైనట్లు వెలుగు చూసింది. లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ-జేడీఎస్ పొత్తు పెట్టుకోవడంతో మండ్య జిల్లా బీజేపీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

జేడీఎస్ తో పొత్తును వ్యతిరేకించిన బీజేపీ మాజీ మంత్రి కేసీ నారాయణగౌడ్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని అంటున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మాజీ మంత్రి కేసీ నారాయణగౌడ్ రహస్యంగా సమావేశమై చర్చలు జరపడమే ఇందుకుకారణం అయ్యిందని వెలుగు చూసింది. అమావాస్య దాటిన తరువాత మంచి రోజు చూసి బీజేపీ మాజీ మంత్రి కేసీ నారాయణ గౌడ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వెలుగు చూసింది. అయితే మాజీ మంత్రి కేసీ నారాయణ గౌడ కాంగ్రెస్ వెళ్లకుండా చూడాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications