కావేరీ నీళ్లు, బీజేపీతో పొత్తు విషయంలో ఎంపీ సుమలత సంచలన వ్యాఖ్యలు, కొందరికి !
బెంగళూరు/మండ్య: కొత్త ఫార్ములా రూపకల్పన ద్వారానే కావేరీ జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని కర్ణాటకలోని మండ్య ఎంపీ సుమలతా (sumalata) అంబరీష్ స్పష్టం చేశారు. మండ్యలో మాజీ మంత్రి కేసీ నారాయణ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపీ సుమలతా మాట్లాడుతూ కావేరి (cauvery) సమస్యపై జిల్లా ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారని గుర్తు చేశారు.
ఓ ఎంపీగా తాను అలా మాట్లాడలేదని, మండ్యలో ఓ మనిషితా తాను ఆ వ్యాఖ్యలు చేస్తున్నానని సుమలతా (sumalata) అన్నారు ప్రజలను మెప్పించడానికి ఒక చుక్క కూడా వదిలిపెట్టనని చెప్పడం సులభం. కానీ దాన్ని అమలు చెయ్యడం చాలా కష్టంగా ఉంటుందని, కావేరి (cauvery) సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీ (modi) జోక్యం చేసుకోవాలని కొందరు అంటున్నారని పరోక్షంగా కాంగ్రెస్ నాయకులపై సమలతా మండిపడ్డారు.

ప్రధాని నరేంద్ర మోదీ జోక్యంతో కావేరి (cauvery) సమస్యను పరిష్కరించగలిగితే అది సాధ్యమయ్యేదని ఎంపీ సుమలతా (sumalata)అన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న తన భర్త అంబరీష్ కావేరి జలాల కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారని ఎంపీ సుమలతా గుర్తు చేశారు. కావేరి జలాల సమస్యపై ప్రధాని నరేంద్ర జోక్యం చేసుకోవాలని చెబుతున్నవారు అప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? అని సుమలతా కాంగ్రెస్ (congress) నాయకులను నిలదీశారు.
ప్రధాని నరేంద్ర మోదీ (modi) మాకు అందుబాటులోకి రావడం లేదని ఇప్పుడు కొందరు అంటున్నారని, అప్పట్లో అప్పటి ప్రధాని (PM)మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకుని ఉంటే అప్పుడే కావేరి (cauvery)సమస్య పరిష్కారమై ఉండేది కదా అని కాంగ్రెస్ నాయకులను సుమలతా ప్రశ్నించారు. నేను ప్రధాని నరేంద్ర మోదీ కోసం మాట్లాడటం లేదు. కానీనేను దేశ చట్టాల పరిధిలో మాట్లాడుతున్నానని సుమలతా (sumalata)అంబరీష్ అన్నారు.

కావేరీ జలాల విషయంలో తమిళనాడు ప్రజలు పోరాడినంతగా కావేరీ జలాల విషయంలో మనం పోరాడటంలో విఫలం అయ్యామని, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందని మండ్య ఎంపీ సుమలతా అంబరీష్ అభిప్రాయపడ్డారు. జేడీఎస్-బీజేపీ (BJP) పొత్తు రాజకీయల కారణంగా రాజీ మాత్రమేనని సుమలతా (sumalata)పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
పొత్తులు వేరు, లోక్ సభ అభ్యర్థుల టికెట్ కేటాయింపు వేరు అని, టిక్కెట్ల పంపిణీ విషయంలో పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయం తీసుకోవాలని సుమలతా (sumalata) అభిప్రాయం వ్యక్తం చేశారు. మండ్య జిల్లాలో బీజేపీ నుంచి ఎన్నికైన తొలి ఎమ్మెల్యే మాజీ మంత్రి కేసీ నారాయణ గౌడ్ అని. జిల్లాలో టిక్కెట్ల పంపిణీ విషయంలో ముందుగా నారాయణగౌడ్ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని, కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుంటే పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతాయని ఎంపీ సుమలతా (sumalata)అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ (modi) పనితీరును మెచ్చుకుంటూ ఇటీవల బీజేపీకి మద్దతు తెలిపానని, పొత్తు గురించి నా తీర్మానం చెబితే కొందరు బాధపడవచ్చు అని సుమలతా పరోక్షంగా మాజీ సీఎం కుమారస్వామిని ఉద్దేశించి అన్నారు. మండ్య జిల్లా ప్రజలు సహకరిస్తే మళ్లీ మండ్య నుంచి లోక్‌సభకు పోటీ చేస్తానని సుమలతా (sumalata)ఆమె మనసులోని మాటను బహిరంగంగా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటక మాజీ మంత్రి కేసీ నారాయణగౌడ్ మాట్లాడుతూ సుమలత (sumalata)మా పార్టీ ఎంపీ. ఆమెకు మళ్లీ మండ్య లోక్‌సభ స్థానం టికెట్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ ను కోరారు. జిల్లాలో జేడీఎస్ ప్రభావం ఎక్కువగా ఉందనేది అబద్ధం. జిల్లాలో గతంలో నాతో సహా ఎనిమిది మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉండగా సుమలతా పార్టీయేతర ఎంపీగా (MP) విజయం సాధించారని మాజీ మంత్రి కేసీ నారాయణగౌడ అన్నారు.
నేను గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేగా (MLA) ఉన్నందున సుమలతా కోసం పని చేయలేదు, అంబరీష్ నాకు చాలా సహాయం చేశారని, సుమలతాకు (sumalata) బీజేపీ టికెట్ ఇస్తే అంబరీష్ రుణం తీర్చుకునే అవకాశం నాకు దక్కుతుందని, నేను జేడీఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం అనుభవించానో చెప్పలేనని మాజీ మంత్రి నారాయగౌడ అన్నారు.

లోక్ సభ ఎన్నికల సమయంలో ఎంపీ టిక్కెట్ల పంపిణీలో పార్టీ నా అభిప్రాయం కూడా తీసుకోవాలని, జేడీఎస్‌తో పొత్తుకు నా మనస్సాక్షి అంగీకరించదని, పొత్తు కుదిరితే జేడీఎస్‌తో కలిసి పనిచేయలేమి మాజీ మంత్రి కేసీ నారాయణగౌడ సంచలన వ్యాఖ్యలు చెయ్యడం ఇప్పుడు మండ్య జిల్లా రాజకీయాలను కుదిపేస్తోంది. మొత్తం మీద బీజేపీ-జేడీఎస్ (JDS) పొత్తుల సందర్బంగా అప్పుడే రెండు పార్టీల నాయకుల విభేదాలు తెరమీదకు వస్తున్నాయి.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications