పట్టాలు తప్పిన మంగళ రైలు: నలుగురు మృతి?

Mangala Express derails near Nashik; 5 feared dead
నాసిక్: మహారాష్ట్రలో మంగళ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఎర్నాకులానికి చెందిన మంగళ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో నలుగురు మరణించినట్లు అనుమానిస్తున్నారు. నాసిక్ సమీపంలోని ఘోటి వద్ద రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 50 మంది గాయపడ్డారు.

శిథిలాల కింద 25 మంది చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. రైలు ప్రమాదం శుక్రవారం ఆరున్నర గంటల ప్రాంతంలో జరిగింది. మధ్య రైల్వేలోని నాసిక్ సమీపంలో ఘోటీ - ఇగ్తాత్పూర్ సెక్షన్ మీదుగా వెళ్తుండగా నిజాముద్దీన్ - ఎర్నాకులం మంగళ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది.

ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. గాయపడినవారిని ఘోటీ,త కాసర, నాసిక్ సివిల్ ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తమ బంధువుల ఆచూకీ తెలుసుకోవడానికి మధ్య రైల్వే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది.

ఈ ప్రమాదంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మన్మాడ్ - కుర్లా - గోదావరి ఎక్స్‌ప్రెస్, మన్మాడ్ - ముంబై పంచవటి ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు పలు రైళ్లు రద్దయ్యాయి. సేవాగ్రామ్ ఎక్స్‌ప్రెస్, రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ రైళ్లను లాసాల్గావ్ వద్ద నిలిపేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+