వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కక్ష్యలోకి 'మామ్' సక్సెస్, తొలి ఆసియా దేశంగా భారత్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను అంగాకరక కక్ష్యలోకి ప్రవేశపట్టే ప్రక్రియను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ లామ్ శాస్త్రవేత్తలు మండిచారు. ఉదయం 7.42 నుంచి 8.04 గంటల వరకు ఉపగ్రహ చలన దిశను ఇశ్రో మళ్లించనుంది.

ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కేంద్రమంత్రి సదానంద గౌడ తదితరులు ఇస్రో కంట్రోల్ రూమ్ నుంచి మామ్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను వీక్షించారు. మామ్ ఇంధన దహన ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ వేగం క్రమంగా తగ్గుతోంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ గ్రహణ స్దితిని దాటింది.

కాసేపట్లో మామ్ అంగారక గ్రహం కక్ష్యలోకి ప్రవేశించనుంది. మామ్ ఇంధన దహన ప్రక్రియ ముగిసింది. నిర్దేశిత సయమం ప్రకారం 24 నిమిషాల పాటు ద్రవ ఇంజిన్లు మండాయి. దీంతో సెకనుకు 22.1 కిమీ నుంచి క్రమంగా మామ్ వేగం తగ్గి గ్రహణ స్దితి దాటింది. దీంతో అంగారక గ్రహం గురుత్వాకర్షణలోకి 'మామ్' చేరుకుంది.

Mangalyaan: A 'MOM' never disappoints: Narendra Modi; NASA, Twitter agree

మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయవంతం కావడంతో ఇస్రోలో శాస్త్రవేత్తలు హార్షం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తలు పరస్పరం అభినందలు తెలుపుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మామ్ విజయంవంతమైన వెంటనే ప్రధాని నరేంద్రమమోడీ ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్‌, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని విజయవంతం చేయాలని వారిని అభినందించారు.

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష రంగంలో అగ్ర రాజ్యాల సరసన భారత్ నిలిచింది. అత్యంత క్లిష్టమైన అంగారక గ్రహ యాత్రను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. ఈ చేపట్టిన తొలి ప్రయోగంలోనే అంగారకుడి కక్ష్యలోకి భారత్ ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్ గా పంపగలిగింది. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా చరిత్ర సృష్టించింది. అంగారక యాత్రలో ఆసియా అగ్ర దేశాలైన చైనా, జపాన్ లు సైతం ఈ ప్రయోగంలో విఫలమయ్యాయి.

అమెరికా, యూరప్ దేశాలు ఊహించనంత తక్కువ ఖర్చులో అంగారక యాత్రను ఇస్రో పూర్తి చేయడం విశేషం. కేవలం రూ. 450 కోట్ల (6.7 కోట్ల డాలర్లు) వ్యయంతో ఈ ప్రాజెక్టును ఇస్రో నిర్వహించింది. ఈ ప్రయోగం కోసం మన దేశంలోని ప్రతి వ్యక్తిపై కేవలం రూ. 4 భారం మాత్రమే పడటం విశేషం. అంగారక యాత్ర కోసం చేపట్టిన ప్రయోగం కోసం అమెరికా ఏకంగా 67.1 కోట్ల డాలర్లు ఖర్చు చేయడం గమనార్హం. మంగళయాన్ విజయంతో... అమెరికా, యూరప్, రష్యాల సరసన భారత్ నిలిచింది.

English summary
The much awaited Mass Orbiter Mission (MOM) will decide the fate of Indian space mission in the global chapter. While NASA's MAVEN is already on Mars, gathering climatic updates, the 'Mangalyaan' will enter the orbiter today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X