కేజీ మామిడి కాయలు మన దేశంలో మూడు లక్షల రూపాయాలు, మీరు నమ్ముతారా ?

భువనేశ్వర్/ఒడిశా: ఇప్పుడు దేశవ్యాప్తంగా టమాటాల ధరలు ఎక్కువ అని అందరూ అంటున్నారు. అయితే ఇక్కడ మరింత ఖరీదైన పండు ఉంది. దీనిని ఒక రైతు పండించాడు. అదంతా ఏమిటో అంటే ?. ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన రక్ష్యకర్ భోయ్ అనే రైతు ఆయన తోటలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి మియాజాకిని పండించినట్లు పేర్కొన్నారు.

మియాజాకి మామిడి విలక్షణమైన రుచి మరియు పోషక విలువలతో అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ.2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు పలుకుతోంది. ఈ మామిడి పండ్లకు అంత ధర ఉంది. ఈ ఖరీదైన మామిడి రైతు రక్ష్యకర్ భోయ్ టీచర్ గా కూడా పని చేస్తున్నారు. ఈయన తన పొలంలో వివిధ రకాల మామిడి పండ్లను పండిస్తున్నాడు. ఒడిశా రాష్ట్ర ఉద్యానవన శాఖ ద్వారా విత్తనాలు పొందిన తరువాత అతను తన తోటలో మియాజాకి రకాన్ని పెంచడం ప్రారంభించాడు.

mangos1
మియాజాకి రకం నిజానికి జపనీస్ రకం. ప్రత్యేకమైన రుచి మరియు ఔషధ విలువల కారణంగా విదేశాలలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ రకమైన మామిడి పండ్లు దాని రూపానికి చాలా రంగు రంగులది. దీనికి ప్రత్యేకమైన రుచి కూడా ఉంది. ఇది ఇతర మామిడి రకాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సీతో పాటు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

ఇది వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. శరీరంలోని మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతు ఇతర వ్యాధులు రాకుండా ప్రోత్సహిస్తుంది. ఇందులో డైటరీ ఫైబర్, పొటాషియం మరియు మెగ్నీషియం కూడా ఉన్నాయని రక్ష్యకర్ భోయ్ చెప్పారు. కలహండి సహాయ ఉద్యానవన సంచాలకులు టంకధర కాలో మాట్లాడుతూ ఈ రకం మామిడిపై మరింత పరిశోధనలు జరగాలన్నారు.

మియాజాకిని బెంగాలీలో 'రెడ్ సన్' మరియు 'సుర్జా డిమ్' (ఎరుపు గుడ్డు) అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ఇప్పుడు కూరగాయలకు రెక్కల వచ్చాయి. భారతదేశంలోనే ఇలాంటి రేట్లు ఉంటే ఇక విదేశాల్లో భారతదేశంలో పండుతున్న కూరగాయలకు ఎలాంటి రేట్లు ఉంటాయో ఊహించుకోవచ్చు. మొత్తం మీద భారతదేశంలోని రైతులు రెండు చేతులా సంపాదిస్తుంటే మనం ఆనందించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+