ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం, ఐబీతో కుకీల రహస్య చర్చలు, మణిపూర్ లో అప్పుడే !

ఇంపాల్/మణిపూర్: మణిపూర్‌లో హింసకు పాల్పడిన వారిమీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఎవ్వరిని వదిలిపెట్టమని కేంద్ర ప్రభుత్వం కుకీ గ్రూపులకు హామీ ఇచ్చింది, అయితే మణిపూర్ లో సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మాత్రమే రాజకీయంగా పరిష్కారాన్ని సాధించగలమని కేంద్ర ప్రభుత్వం కుకీలకు స్పష్టం చేసింది.

ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్, మణిపూర్ ట్రైబల్ ఫోరమ్ సభ్యులు ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) డైరెక్టర్ తపన్ కుమార్ దేకాతో జూలై 7న రాజధానిలోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయమైన నార్త్ బ్లాక్‌లో సమావేశమయ్యారు.

manipure2

మే 3 నుండి రెండు కులాల హింస మణిపూర్ అల్లకల్లోలం అయ్యింది. కుకీలు, మెయిటీ కులాలకు చెందిన పౌర సమాజ సమూహాలతో కేంద్ర ప్రభుత్వం బ్యాక్ డోర్ చర్చలు జరుపుతోంది. మణిపూర్ హింసలో 140 మందికి పైగా మరణించారు. దాదాపు 60,000 మంది నిర్వాసితులయ్యారు. జూన్ 1న హోంమంత్రి అమిత్ షా మణిపూర్ లో పర్యటించారు. మణిపూర్ గవర్నర్ నేతృత్వంలోని శాంతి చర్చలు జరిగినా ఇంకా హింస చల్లారలేదు.

శుక్రవారం బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన తాజా హింసలో ముగ్గురు చనిపోయారు. అనుమానిత సాయుధ దుండగులు శుక్రవారం తెల్లవారుజామున 1 గంటల సమయంలో ఫౌగాక్‌చావో ఇఖాయ్ అవాంగ్ లైకై, క్వాక్తా ప్రాంతాలపై కాల్పులు జరిపగా ఓ వ్యక్తి చనిపోయాడు. పోలీసులు, భద్రతా బలగాలు దుండగులను తిప్పికొట్టాయి. ఐదుగురు అనుమానిత సాయుధ దుండగులకు బుల్లెట్ గాయాలు అయ్యాయని, ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు.

manipure1
ఐబి అధికారులతో కుకీ గ్రూపుల సమావేశానికి హాజరైన ఓ వ్యక్తి ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం దీర్ఘకాలిక, తాత్కాలిక పరిష్కారాలపై చర్చలు జరుపుతోందని అన్నారు. హింస చెలరేగినప్పటి నుండి కుల సంఘాల కోసం ప్రత్యేక పరిపాలనను డిమాండ్ చేస్తున్న 24 కుకీ తిరుగుబాటు గ్రూపులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

ఐబీ చీఫ్ మమ్మల్ని సాధారణ స్థితిని కొనసాగించాలని, హింస అంతమైతే రాజకీయ పరిష్కారాన్ని త్వరగా సాధించవచ్చని మనవి చేశారని కుకీ లీడర్ అన్నారు. మెయిటీ పెద్ద సోదరుడిలా వ్యవహరించాలని, కుకీ గ్రామాలపై దాడులను ముందుగా ఆపాలని కుకీలు ఐటీ చీఫ్ కు చెప్పారని తెలిసింది. కుకీ గ్రూపులు చురచంద్‌పూర్‌లోని 96 గ్రామాల పూర్తి సమాచారాన్ని ఐబీ అధికారులకు అందించాయి. కొండలు, లోయ జిల్లాల్లోని గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన అన్ని బంకర్లను కూల్చివేస్తామని జూలై 3వ తేదీన మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ ఆందోళనకారులను హెచ్చరించారు.

manipure1

సాయుధ ముఠాల నుండి తమను తాము రక్షించుకోవడానికి గ్రామస్థులు ఇసుక బస్తాల నుండి టిన్ షెడ్‌ల వరకు రక్షణాత్మక నిర్మాణాలను ఏర్పాటు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాయుధ పోలీసు బలగాలను, సైన్యాన్ని ఈ బఫర్ జోన్లలో మోహరించింది. ఇక్కడ తరచుగా కుకీలు, మెయిలీ స్థావరాలు ఒకదానికొకటి ఆనుకుని ఉంటాయి.

ఈ ప్రాంతాల్లో మరిన్ని బలగాలను మోహరిస్తామని అధికారులు చెప్పారు. : పౌరులు మొదట ఆయుధాలను వదిలిపెట్టాలని అధికారులు మనవి చేశారు. పోలీసు ఆయుధాలలో 4, 000 కంటే ఎక్కువ అధునాతన ఆయుధాలను ఆందోళనకారులు ఎత్తుకుపోయాయి. అయితే ఇప్పటి వరకు ఆందోళనకారుల దగ్గర ఉన్న 1,100 కంటే ఎక్కువ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంఫాల్‌లోని రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మార్చురీల్లో ఉన్న మృతదేహాలను గుర్తించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కుకీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+