మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత: కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హింసాత్మక ఘటనలను కట్టడి చేసేందుకు 'తీవ్రమైన కేసుల్లో' కనిపిస్తే కాల్చివేతకు మణిపూర్ గవర్నర్ ఆదేశించినట్లు ప్రభుత్వ కమిషనర్(హోం) టి. రంజిత్ సింగ్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొదట ఆందోళనలను కట్టడి చేసేందుకు ప్రయత్నించాలని.. ఒకవేళ పరిస్థితిని నియంత్రించలేని పరిస్థితులు ఏర్పడితే కాల్పులకు అవకాశం కల్పిస్తూ గవర్నర్ తరపున జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
మణిపూర్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చెలగేగిన ఈ హింసను నియంత్రించేందుకు 55 కంపెనీలతో కూడిన ఆర్మీ, అస్సాం రైఫిల్స్ సిబ్బందిన మోహరించారు. అలాగే, మళ్లీ హింసాత్మక ఘటనలు చెలరేగితే రంగంలోకి దించేందుకు మరో 14 బృందాలను సిద్ధంగా ఉంచినట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. మణిపూర్‌లో పరిస్థితిని కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికే కేంద్ర బలగాలు మణిపూర్ రాష్ట్రానికి చేరుకున్నాయి.

హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఇప్పటికే కర్ఫ్యూ విధించింది. చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. కాగా, మెజార్టీ మెయితీ/మైతీ కమ్యూనిటీని షెడ్యూల్ తెగలో చేర్చే చర్యల్ని వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మక మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో మణిపూర్ ముఖ్యమంత్రి కోరడంతో కేంద్రం కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపింది. శాంతిభద్రతలను కేంద్రం నిశితంగా గమనిస్తోంది.
#WATCH | Manipur: An Indian Air Force (IAF) aircraft, carrying Central forces, landed in Imphal earlier this evening. pic.twitter.com/RTwy2oK0hj
— ANI (@ANI) May 4, 2023
కాగా, ఇప్పటివరకు సమస్యాత్మక ప్రాంతాల్లోని 7,500 మంది ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. రాజధాని ఇంఫాల్, చుర్‌చంద్‌పూర్, కాంగ్‌పోక్పి సహా పలు జిల్లాల్లో ఉద్రిక్తతల తారాస్థాయికి చేరుకోవడంతో మణిపుర్ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. ఐదు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.












Click it and Unblock the Notifications