‘భారతీయురాలివేనా?’: మణిపురి యువతికి వేధింపు, సుష్మా సీరియస్

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగే ప్రపంచ మహిళా సదస్సుకు వెళ్తున్న మణిపురి యువతిని ఢిల్లీ విమానాశ్రయంలో ఓ అధికారి వేధింపులకు గురిచేశాడు. పాస్‌పోర్టును చూస్తూ 'నీవు భారతీయురాలిగా కనపడుట లేవు, మణిపురితో ఉన్న సరిహద్దు రాష్ట్రాల పేరు చెప్పు' అంటూ ఆ ఇమ్మిగ్రేషన్ అధికారి నోటి దురుసును బయటపెట్టాడు.

అధికారి తీరుతో ఖంగుతున్న ఆ యువతి విమాన ప్రయాణానికి ఆలస్యమవుతోందని బదులిచ్చింది. యువతి మాటలకు సమాధానంగా 'నిన్ను వదలిపెట్టి విమానం ఎక్కడికి వెళ్లదు. ప్రశాంతంగా సమాధానమివ్వు' అంటూ అధికారి వేధింపులకు పాల్పడ్డాడు.

Manipuri woman alleges racism

ఈ ఘటన శనివారం ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అధికారి తీరును, వేధింపులను మణిపురికి చెందిన సదరు యువతి మోనికా ఖంగెంబమ్ తన ఫేస్‌బుక్ ద్వారా పంచుకుంది. ఈ విషయాన్ని కొందరు నెటిజన్లు ట్విట్టర్ ద్వారా విదేశాంగశాఖ మంత్రి సుష్మ స్వరాజ్ దృష్టికి తీసుకొచ్చి ఇమ్మిగ్రేషన్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

'మన ఆడబిడ్డలు ఎవరూ జాతి వివక్ష వేధింపులపై ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులను ఈ విషయంలో వదిలిపెట్టకూడదు. వెంటనే అధికారిపై తగిన చర్యలు తీసుకోండి' అని ఓ నెటిజన్.. సుష్మాకు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన సుష్మా స్వరాజ్.. ఆ అధికారి దురుసు ప్రవర్తన పట్ల.. సదరు మణిపురి యువతికి క్షమాపణలు చెప్పారు. సదరు విమానాశ్రయ అధికారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Manipuri woman alleged on Saturday that an immigration official at Delhi’s Indira Gandhi International Airport hurled racist remarks at her when she was on her way to Seoul for a conference.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి