మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు ప్లేస్, టైమ్ ఫిక్స్-కేంద్ర హోంశాఖ ప్రకటన..!
డిసెంబర్ 26వ తేదీ అనారోగ్యంతో కన్నుమూసిన భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన భౌతిక కాయాన్ని అభిమానులు, నాయకులు, ప్రముఖుల సందర్శన కోసం ఆయన నివాసంలోనే ఉంచారు. డిసెంబర్ 28 శనివారం మన్మోహన్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో యమునా నదీ తీరంలో మన్మోహన్ అంత్యక్రియలు, స్మారకం ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. అయితే కేంద్రం మరో చోటు కేటాయించింది.
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు యమునా నది తీరంలోని రాజ్ ఘాట్ వద్ద స్థలం కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. అలాగే ఫోన్ కూడా చేసినట్లు ఆయన వెల్లడించారు. నిన్న ఉదయం తాను ప్రధాని మోడీకి ఫోన్ చేసి డిసెంబర్ 28న జరిగే డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు చోటు కేటాయించాలని కోరినట్లు ఖర్గే తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు.

భారతదేశపు గొప్ప కుమారుడి స్మారకానికి ఇది పవిత్ర వేదికగా ఉంటుందని ఖర్గే ఎక్స్ లో తెలిపారు. గతంలో పలువురు మాజీ ప్రధానులు, రాజనీతిజ్ఞుల అంత్యక్రియలు రాజ్ ఘాట్ లోనే జరిగాయని, అక్కడే సంప్రదాయం ప్రకారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారకం ఏర్పాటు కోసం స్థలం ఇవ్వాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు కోరారు. అయితే కేంద్రం మాత్రం నిగమ్ బోధ్ ఘాట్ ను మన్మోహన్ అంత్యక్రియలకు కేటాయించింది. డిసెంబర్ 28వతేదీ ఉదయం 11.45కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications