భారతరత్న: 'వాజ్‌పేయి, పీవీలకు మన్మోహాన్ ప్రతిపాదన.. సోనియా వద్దన్నారేమో'
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధానులు అటల్ బీహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహారావులకు భారతరత్నలను ప్రకటించేందుకు మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ అంగీకరించారని ఆయన మీడియా సలహాదారు సంజయ బారు పేర్కొన్నారు.
అయితే అందుకు యూపీఏ సర్కారు అంగీకారం తెలపలేదని ఆయన వెల్లడించారు. ఆనాటి ప్రధాని ప్రతిపాదన ఈరోజుకీ వెలుగుచూడలేదని సంజయ బారు అన్నారు. మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా కొనసాగిన నాటి స్మృతులను గుర్తు చేసుకున్న సందర్భంగా బారు ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘అటల్ జీతో పాటు పీవీకి కూడా భారతరత్న తీసుకునేందుకు అర్హత ఉందని సూచించాను. నా ప్రతిపాదనకు మన్మోహన్ కూడా అంగీకరించారు. అయితే ఎందుకనో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆ ప్రతిపాదనను కొట్టేశారేమో నాకు తెలియదు'' అంటూ సంజయ బారు అన్నారు.

ప్రస్తుతం సంజయ బారు జియా-ఎకనమిక్స్, స్ట్రాటజీకి డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్‌కు 2004-08 వరకు సంబయ బారు మీడియా సలహాదారుగా వ్యవహారించారు. ఇక కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని వాజ్‌పేయి పుట్టిన రోజైన డిసెంబర్ 25కి ఒక్క రోజు ముందు ఆయనతో పాటు స్వాతంత్య సమరయోధుడు పండిట్ మదన్ మోహన్ మాలవ్యకు భారతరత్నను ప్రకటించింది.
ఇప్పటి వరకు మనదేశంలో భారతరత్న అవార్డును 43 మందికి ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో కేవలం ముగ్గురికి మాత్రమే భారతరత్న అవార్డుని ప్రకటించింది. వారిలో హిందూస్ధాన్ క్లాసికల్ కళాకారుడు భిమన్ జోషి, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, శాస్తవేత్త సీఎన్ఆర్ రావులు ఉన్నారు.












Click it and Unblock the Notifications