వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చూస్తూ ఊరుకునేది లేదు: డేరా అల్లర్లపై ప్రధాని మోడీ ఆగ్రహం

డేరా ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం స్పందించారు. 35వ మన్ కీ బాత్‌లో ఆయన అల్లర్లపై మాట్లాడారు. అల్లర్లను సహించేది లేదని తేల్చి చెప్పారు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవద్దన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డేరా ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం స్పందించారు. 35వ మన్ కీ బాత్‌లో ఆయన అల్లర్లపై మాట్లాడారు. అల్లర్లను సహించేది లేదని తేల్చి చెప్పారు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవద్దన్నారు.

గుర్మీత్ సింగ్‌పై 5 కేసులు: జర్నలిస్ట్ హత్య, శిష్యులకు వ్యంధత్వంపై ఆరోపణలు.. గుర్మీత్ సింగ్‌పై 5 కేసులు: జర్నలిస్ట్ హత్య, శిష్యులకు వ్యంధత్వంపై ఆరోపణలు..

మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుడు వంటి మహనీయులు పుట్టిన స్థలం మన భారత దేశం అన్నారు. ఇలాంటి చోట హింసకు తావులేదన్నారు. హర్యానాలోని పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

హింసకు దిగితే.. మోడీ వార్నింగ్

హింసకు దిగితే.. మోడీ వార్నింగ్

తనను తాను దైవాంశ సంభూతునిగా చెప్పుకునే గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు శిక్ష పడిన నేపథ్యంలో ఆయన అనుచరులు చేస్తున్న హింసాత్మక ఘటనలను ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, కోర్టుల ముందు ప్రజలంతా సమానమే అన్నారు. నిరసనలు శాంతియుతంగా మాత్రమే చేసుకోవాలని, హింసకు దిగితే మాత్రం చూస్తూ ఊరుకోబోయేది లేదని హెచ్చరించారు.

గణేష్ పండుగపై..

గణేష్ పండుగపై..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన, పరిశుభ్ర వాతావరణంలో పండగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణం పట్ల యువత అవగాహన పెంచుకోవాలని, ఈ విషయంలో గణేష్ విగ్రహాలే నాంది కావాలన్నారు. పర్యావరణాన్ని పాడుచేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వాడకం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిందన్నారు.

అదే ఆందోళన

అదే ఆందోళన

ప్రస్తుత యువత కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లకు పరిమితమై, మైదాన క్రీడలకు దూరం అవుతుండటం తనను ఆందోళన పరుస్తోందని మోడీ అన్నారు. భారత యువత మైదాన క్రీడల్లో రాణించాలన్నారు. ఆరుగురు భారతీయ మహిళా నావికులు ప్రపంచమంతా చుట్టి వచ్చారని, ఈ విషయం తెలిసిన తర్వాత తనకెంతో గర్వంగా అనిపించిందన్నారు. ఫీఫా అండర్ 17 వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొనేందుకు భారత్ వస్తున్న ప్రతి దేశపు జట్టుకూ తాను స్వాగతం పలుకుతున్నానని, ఇక్కడి సంస్కృతి, ఆతిథ్యం వారికి తప్పకుండా నచ్చుతుందనే భావిస్తున్నానని తెలిపారు.

అక్కడ మల విసర్జన జరగడం లేదు

అక్కడ మల విసర్జన జరగడం లేదు

దేశంలో 2 లలకు పైగా గ్రామాల్లో ఇప్పుడు బహిరంగ మల విసర్జన జరగడం లేదని మోడీ వెల్లడించారు. స్వచ్ఛ భారత్ కల సాకారం దిశగా జరుగుతున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో ప్రజలు అందించే సూచనలను తాను ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తుంటానన్నారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన విజయవంతమైందని, ఎన్నో దేశాలు ఈ స్కీమ్ ను నిశితంగా గమనిస్తున్నాయని మోడీ వ్యాఖ్యానించారు. వ్యవస్థకు పన్ను రూపంలో వచ్చే కొంత మొత్తం కూడా ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని తెలిపారు. ప్రజల జీవన విధానాన్ని మార్చడం వెనుక తొలి అడుగు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, భావి భారత పౌరులను తీర్చిదిద్దే సమయంలోనే వారికి అన్ని రకాల అంశాలపైనా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సాయం అవసరమైన ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

English summary
After Friday’s violence in Haryana claimed the lives of at least 36 dera followers, Prime Minister Narendra Modi said violence in any form is unacceptable and the guilty will not be spared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X