మెరుగైన చికిత్స కోసం అమెరికాకు గోవా సీఎం పారికర్
ముంబై: గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్ అత్యవసర చికిత్స కోసం అమెరికాకు వెళ్లనున్నారు. ఈ మేరకు గోవా గవర్నర్ మృదుల సిన్హా ఆఫీస్ నుంచి ప్రకటన విడుదలైంది. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం తాను అమెరికా వెళుతున్నట్టు తెలుపుతూ గవర్నర్‌కు పారికర్ లేఖ రాశారు.
ఆ విషయాన్నే తెలుపుతూ గవర్నర్ ఆఫీసు నుంచి ప్రకటన విడుదలైంది. అంతేగాక గోవా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పారికర్ వీడియో విడుదల చేశారు. తనకు మెడికల్ లీవ్ కోరారు. తన కోసం ప్రార్థనలు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉంటే ఇటీవలే ముంబైలో ఆయన రెండు సార్లు మెడికల్ చెకప్ చేయించుకున్నారు. స్వల్ప కాలేయ వ్యాధితో పారికర్ బాధపడుతున్నట్లు తెలిసింది. గత ఫిబ్రవరి 15న ఆయన లీలావతి హాస్పిటల్‌లో అకస్మాత్తుగా చేరారు.ఇవాళ అమెరికాకు పారికర్ బయలుదేరి వెళ్ళనున్నారు.












Click it and Unblock the Notifications