నకిలీ నోట్లు ముద్రిస్తాం: ముగ్గురు ఆంధ్ర మోసగాళ్లు
బెంగళూరు: నకిలీ నోట్లు ముద్రించి ఇస్తామని నమ్మించి మోసం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు నిందితులను బెంగళూరు నగరంలోని కాడు గోడి పోలీసులు అరెస్టు చేశారు. వీరెంత మందిని మోసం చేశారు అని ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లోని కడప నగరంలోని రాజీవ్ గాంధీ నగరకు చెందిన హనుమంతు (27), ప్రకాశం జిల్లా జేవీ కృష్ణాపురం కు చెందిన ప్రసాద్ (37), చిత్తూరు జిల్లా అరవచేనుపిల్ల గ్రామానికి చెందిన దామోదర మునిరత్నం (42) అనే నిందితులను అరెస్టు చేశామని గురువారం పోలీసులు చెప్పారు.

వీరు ముగ్గురు బెంగళూరు చేరుకుని వివిధ ప్రాంతాలలో నివాసం ఉంటున్నారు. పలుచోట్ల నివాసం ఉంటున్న వ్యాపారులు, అమాయకులను వీరు సంప్రదించారు. అనంతరం తాము నకిలి నోట్లు (రూ. 1,000 నోట్లు ) ముద్రించి ఇస్తామని చెప్పారు.
రూ. 1,000 నకిలి నోట్లు ఇచ్చిన తర్వాత మీరు అందులో అర్దం డబ్బు (నిజమైనవి) ఇస్తే చాలని మాయమాటలు చెప్పారు. నిందితులు మోసం చెయ్యడానికి ప్రయత్నించిన సమయంలో కాడుగోడి సమీపంలోని బెళతూరు బస్ స్టాండ్ దగ్గర అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. నిందితుల నుండి నకిలి నోట్లు, వివిధ రకాల కెమికల్స్ స్వాదీనం చేసుకున్నామని కాడుగోడి పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications