నా రాజీనామాకు సీఎంకు లింక్ లేదు, నా పరిస్థితి ఇదే

కర్ణాటకలోని మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) చైర్మన్ మరిగౌడ ఆయన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి పార్వతికి భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మరిగౌడ రాజీనామా చెయ్యడం కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ముడా అధ్యక్షుడు మరిగౌడ్ తన రాజీనామా లేఖను కర్ణాటక పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మరిగౌడ అనారోగ్య కారణాల వల్లే తాను రాజీనామా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఇలాంటి సమయంలో తాను ఈ పదవిలో కొనసాగడం కష్టం అవుతుందని,
తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తాను సొంత కారణాల వలన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని మరిగౌడ తెలిపారు. తన ఆరోగ్య సమస్యలే రాజీనామాకు ప్రధాన కారణం అని మరిగౌడ మీడియాకు చెప్పారు.

Mari Gowda resigned from the post of Muda after a case was registered against CM Siddaramaiah

నాకు గతంలో రెండుసార్లు గుండెపోటు వచ్చిందని, నేను ఇంకా బాధ్యతలు నిర్వహించలేనని, కాబట్టి నేను రాజీనామా చేశానని మరిగౌడ తెలిపారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్న ముడా స్థలంలో భూ కేటాయింపు కేసు విచారణ గురించి మరిగౌడ మాట్లాడారు. కోర్టులో విచారణ కొనసాగుతుందని, అసలు నిజం బయటపడుతుందని అన్నారు. ఏమైనా అవకతవకలు జరిగాయా అనేది విచారణలో తేలుతుందని మరిగౌడ మీడియాకు చెప్పారు.

నేను గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, తాలూకా, జిల్లా పంచాయతీ ప్రెసిడెంట్‌గా పని చేశానని మరిగౌడ అన్నారు. మీ రాజీనామా ముఖ్యమంత్రి సిద్దరామయ్యను రక్షించే ప్రయత్నమా అని మీడియా ప్రశ్నించగా మరి గౌడ్ ఆ మాటను తోసిపుచ్చారు, నేను ఎవరినీ రక్షించడానికి ప్రయత్నించలేదని, తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని అన్నారు. కర్ణాటక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేశ్‌ ను కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారనే ఊహాగానాలు కూడా వచ్చాయని, అందులో నిజం లేదని మూడా పదవికి రాజీనామా చేసిన మరిగౌడ మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+