వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

700డాలర్లే: కొచ్చి కుర్రాడితో జుకర్ బర్గ్ ఒప్పందం!

|
Google Oneindia TeluguNews

కొచ్చి: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌తో కేరళకు చెందిన ఓ ఇంజినీరింగ్ కుర్రాడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జుకర్ బర్గ్ ఈ కుర్రాడితో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపడం గమనార్హం. ఇంటర్నెట్‌ రంగంలో తన సత్తా చూపించిన ఇంజినీర్ అమల్ అగస్టన్ ఈ విజయం సాధించాడు.

ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్న అమల్‌ ఇటీవల 'మాక్స్‌చాన్‌జుకర్‌బర్గ్‌.ఓఆర్‌జీ' పేరిట ఓ వెబ్‌సైట్‌ డొమైన్‌‌ను రిజిస్టర్‌ చేయించుకున్నాడు. ఈ వెబ్‌సైట్ పేరులో జుకర్‌బర్గ్‌ కూతురు మాక్సీమా చాన్‌ జుకర్‌బర్గ్‌ సంక్షిప్తనామం ఉండటంతో ఈ డొమైన్ హక్కులు కొనుగోలు చేసేందుకు ఫేస్‌బుక్‌ ముందుకొచ్చింది.

అమల్‌తో బేరసారాలు ఆడిన ఫేస్‌బుక్.. 700డాలర్ల (రూ. 46వేల)కు ఈ వెబ్‌సైట్‌ను సొంతం చేసుకుంది. ఈ డొమైన్‌ పేరుకు ఎంత డబ్బు వచ్చిందన్న దానికన్నా.. ఏకంగా ఫేస్‌బుక్‌ తనను ఆశ్రయించి బేరసారాలు జరిపిందన్న అంశమే తనకు ఎక్కువగా థ్రిల్‌ ఇస్తున్నదని అమల్‌ చెబుతున్నాడు.

Mark Zuckerberg buys domain name from engineering student in Kochi

ఇంటర్నెట్‌ డొమైన్ పేర్లను సొంతం చేసుకోవడం తన హాబీ అని, ఈ హాబీ వల్ల కొంత ఆదాయం కూడా ఆనందం కలిగిస్తున్నదని తెలిపాడు. జుకర్‌బర్గ్ దంపతులకు కూతురు పుట్టిన డిసెంబర్‌ నెలలో తాను ఈ పేరుతో డొమైన్‌ రిజిస్టర్‌ చేశానని చెప్పాడు.

మొదట 'గోడ్యాడీ' వెబ్‌ హోస్టింగ్ కంపెనీ ద్వారా తన డొమైన్‌ కొనుగోలుకు ఆఫర్‌ వచ్చిందని, ఎంతకు అమ్ముతారని అడిగితే.. తాను ఎక్కువగా అడుగకుండా కేవలం 700 డాలర్లు చెప్పానని, వాళ్లు అంగీకరించారని అమల్ తెలిపాడు. కానీ డొమైన్‌ కొనుగోలు డీల్‌ పూర్తయిన తర్వాత తన డొమైన్ సొంతం చేసుకున్నది ఫేస్‌బుక్‌ అని తెలియడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాడు.

జుకర్‌బర్గ్‌ ఆర్థిక వ్యవహారాలు చూసే 'ఐకానిక్‌ క్యాపిటల్‌' సంస్థ మేనేజర్‌ సారా చాపెల్‌ నుంచి నేరుగా ఈమెయిల్‌ రావడంతో ఈ డొమైన్‌ ఫేస్‌బుక్‌ కొన్నట్టు స్పష్టమైందని చెప్పాడు. ఫేస్‌బుక్‌ ముందుకొచ్చినా ఎలాంటి బేరసారాలు చేయకుండా, ఎక్కువ మొత్తాన్ని ఆశించకుండా చెప్పిన ధరకే అమ్మేశానని అమల్ ఫేస్‌బుక్ ద్వారానే వెల్లడించాడు. ఏదేమైనా ఓ ఇంజినీర్ కుర్రాడు ప్రపంచ సోషల్ మీడియాతో ఒప్పందం కుదుర్చుకోవడం మెచ్చుకోదగ్గ విషయం.

English summary
Mark Zuckerberg may have started the online social networking revolution and made billions of dollars from his game-changing Facebook (FB). But this maverick internet entrepreneur surely didn't reckon with city boy Amal Augustine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X