మార్కెట్లు డౌన్.. భగ్గుమన్న బంగారం, వెండి ధర!
పసిడి ధర భగ్గుమంది. మంగళవారం ఒక్కసారిగా రూ.255 పెరిగి పది గ్రాములు బంగారం ధర రూ.30,390కి చేరుకుంది. దీపావళి తర్వాత డిమాండ్ లేక నేలచూపులు చూసిన పసిడి ధర ఉన్నట్లుండి షాకిచ్చింది.
ముంబై: పసిడి ధర భగ్గుమంది. మంగళవారం ఒక్కసారిగా రూ.255 పెరిగి పది గ్రాములు బంగారం ధర రూ.30,390కి చేరుకుంది. దీపావళి తర్వాత డిమాండ్ లేక నేలచూపులు చూసిన పసిడి ధర ఉన్నట్లుండి షాకిచ్చింది.
అంతర్జాతీయ పరిణామాలు, పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో కొనుగోళ్లు జోరందుకున్నాయి. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోలు మద్దతు లభించడంతో పుత్తడి ధర పైపైకి పోయింది.

షేర్ మార్కెట్ ప్రతికూలత వల్ల ధర పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు పసిడి బాటలోనే వెండి పరుగులు తీసింది. కిలో వెండి ధర రూ.650లు పెరగడంతో రూ.40,700కి చేరింది.
పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారులు కొనుగోళ్లకు ఎగబడటంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. అటు అంతర్జాతీయంగానూ బంగారం ధర 0.95 శాతం పెరగడంతో ఔన్సు 1,281.50 డాలర్లు పలికింది.












Click it and Unblock the Notifications