Marriage: మూడు నెలల ముందే పెళ్లి, కాలేజ్ లో చదివిస్తున్న భర్త, ఆ మ్యాటర్ లో నిరాశ, ఫ్రెండ్ వెళ్లి చూస్తే !

చెన్నై: కాలేజ్ కు వెలుతున్న యువతి ఆమె స్నేహితులతో సంతోషంగా ఉండేది. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత కుటుంబ సభ్యులతో కలిసి ఆమె చాలా హ్యాపీగా ఉండేది. బంధువుల అబ్బాయితో కాలేజ్ అమ్మాయి పెళ్లి చెయ్యాలని ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. వివాహం చేసుకున్న తరువాత కూడా ఆమెను చదివించడానికి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న యువకుడు అంగీకరించాడు. ఇదే సమయంలో కాలేజ్ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. మూడు రెండు నెలల నుంచి భర్త ఇంటి నుంచి ఆమె కాలేజ్ కు వెళ్లి వస్తోంది. అయితే ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కాలేజ్ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాలేజ్ అమ్మాయి ఆత్మహత్యకు అసలు కారణం తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

 కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి

కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి

చెన్నైలో నివాసం ఉంటున్న రోనిషా (22) అనే యువతి చెన్నైలోని అన్నానగర్ లోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో చదువుతోంది. కాలేజ్ కు వెలుతున్న రోనిషా ఆమె స్నేహితులతో సంతోషంగా ఉండేది. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత కుటుంబ సభ్యులతో, చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారితో రోనిషా చాలా హ్యాపీగా ఉండేది.

 పెళ్లి చేసుకున్నా చదివిస్తానని హామీ

పెళ్లి చేసుకున్నా చదివిస్తానని హామీ

తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన అఖిలన్ (27) అనే యువకుడు చెన్నై సమీపంలోని అవడిలో నివాసం ఉంటున్నాడు. అఖిలన్, రోనిషా బంధువులు. బంధువుల అబ్బాయి అఖిలన్ తో కాలేజ్ అమ్మాయి రోనిషా పెళ్లి చెయ్యాలని ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. వివాహం చేసుకున్న తరువాత కూడా రోనిషాను చదివించడానికి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న అఖిలన్ అంగీకరించాడు.

 మూడు నెలల క్రితం పెళ్లి

మూడు నెలల క్రితం పెళ్లి

పెళ్లికి అఖిలన్, రోనిషా అంగీకరించడంతో మూడు నెలల క్రితం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఇద్దరి పెళ్లి జరిగింది. చెన్నై సమీపంలోని అవడిలోని భర్త అఖిలన్ ఇంట్లో ఉంటున్న రోనిషా ప్రతిరోజూ కాలేజ్ కు వెళ్లి వస్తోంది. వివాహం జరిగిన నెల రోజుల నుంచి రోనిషా ఏదో పొగొట్టుకున్నట్లు చాలా డల్ గా ఉంటున్నదని తెలిసింది.

 పెళైన మూడు నెలలకే ఆత్మహత్య

పెళైన మూడు నెలలకే ఆత్మహత్య

ఎప్పటిలాగే సోమవారం భర్త అఖిలన్, అతని కుటుంబ సభ్యులు అందరూ బయటకు వెళ్లిపోయిన తరువాత రోనిషా ఇంట్లో ఉంది. సాయంత్రం రోనిషా స్నేహితురాలు సిలంబరసి ఆమె ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో రోనిషా ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించిన సిలంబరసి గట్టిగా కేకలు వేసింది.

 వైవాహిక జీవితం ఇష్టం లేదని

వైవాహిక జీవితం ఇష్టం లేదని

పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అఖిలన్ ను వివాహం చేసుకున్న రోనిషా ఆమె వైవాహిక జీవితంలో చాలా నిరాశ చెందిందని, ఇదే విషయాన్ని కాలేజ్ లో చదువుతున్న స్నేహితులతో పాటు రోనిషా ఆమె తల్లి శశిరేఖకు కూడా చెప్పిందని పోలీసులు అంటున్నారు. అంతా సర్దుకుంటుంది అని కుటుంబ సభ్యులు రోనిషాకు ధైర్యం చెప్పారని, అయితే ఆవేదనతో ఆమె ఆత్మహత్య చేసుకుందని అవడి పోలీసులు అంటున్నారు. తన భర్తతో తాను సుఖపడటం లేదని రోనిషా ఆమె స్నేహితులకు చెప్పిందని, ఆ విషయంలో స్నేహితులు ఆటపట్టించడం మొదలు పెట్టారని, ఆ విషయంలో రోనిషా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+